అన్ని కాలాల్లో దొరికే అరటి పండు వల్ల అనేక లాభాలు ఉన్నాయి.  నిజంగా అరటిపండు కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిలో  పోషక విలువలు సమృద్ధిగా  ఉంటాయి. కనుక దీనిని తినడం వల్ల మంచి  లాభాలు ఉన్నాయి. అలానే ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. అరటి పండు ను తినడం వలన  అనేక  సమస్యల కి చెక్ పెట్టేయచ్చు.  ప్రదానంగా తీసుకున్న ఆహారం అరగక ఇబ్బంది పడే వారు అరటి పండ్ల ను కనుక తింటే జీర్ణక్రియ బాగా పని చేస్తుంది. కాబట్టి ఈ సమస్యల తో సతమతం అయ్యేవారు తినడం ఎంతో మంచిది.

ఈ పండు లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకానికి కూడా ఇది మంచి ఔషధం అనే చెప్పాలి. రాత్రివేళ మాత్రం దీన్ని తినకుండా ఉండడం మంచిది అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే  శరీరంలో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. దాని వల్ల చల్లగా ఉన్న శరీరాన్ని అరటిపండు మరింత చల్ల బరిచి జలుబు,దగ్గు రావడానికి దారి తీసుతుంది. అందువల్ల రాత్రిళ్లు తప్ప, రోజంతట లో ఈ పండును ఎప్పుడైనా తినవచ్చు. రాత్రి వేళ జీర్ణ క్రియ కూడా నెమ్మదిగా జరుగుతుంది. అందువల్ల రాత్రిళ్లు అరటి పండు తింటే ,అది వెంటనే జీర్ణం కాదు.

హైపర్ టెన్షన్ తో బాధ పడే వారు  అరటిపండు ను తినడం వలన ఆ సమస్యను తేలికగా తగ్గించొచ్చు .ఎందుకంటే దీనిలో పొటాషియం ఉండడం వల్ల  పరిష్కారాన్ని చూపిస్తుంది. అలాగే అరటి లోని చెక్కెర శరీరానికి బలాన్నికలిగిస్తుంది. కానీ రాత్రిళ్ళు మాత్రం తినకండి ఎందుకు అంటే  జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల పడుకునే సమయానికి 2 లేదా 3 గంటల ముందే ఈ పండును తినేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: