నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం యానంపల్లి గ్రామంలో భారీ  వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు.  రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్దంగా  పని చేసి ఉంటే ఇంత  ఘోర విపత్తు రాకుండా ఉండేది అని ఆయన పేర్కొన్నారు. లక్షల ఎకరాల్లో  వేలాది మంది రైతులు వేసిన పంట చేతికి రాకపోవడంతో  చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వర్షాల ధాటికి పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు అని ఆయన విమర్శలు చేసారు.

 వారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతు తమ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో వివరాలు నమోదు చేసుకోవాలి అని ఆయన సూచనలు చేసారు. సన్న రకం బియ్యం వేయకపోతే రైతుబంధు రాదని ఎలా బెదిరించారో... ఇప్పుడు వారిని అలాగే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. కేసీఆర్ కు దుబ్బాక మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు అని విమర్శలు చేసారు. మంత్రులను, ఎమ్మెల్యేలను దుబ్బాక లో తిప్పకుండా రైతుల పంట పొలాల వద్ద తిప్పితే బాగుంటుంది అని ఆయన అన్నారు.

కాగా పదవి వచ్చిన తర్వాత ఆయన కాస్త ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్న ఆయనలో ఇప్పుడు అనూహ్యంగా వచ్చిన మార్పు చూసి షాక్ అయ్యారు. రాజకీయంగా కూడా ఇప్పుడు తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలపడే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన కాస్త రాజకీయంగా ఉత్సాహంగా కదిలే ప్రయత్నం చేస్తున్నారు. పదవి రాగానే ప్రజల్లోకి రావడం చూసి ఇతర పార్టీ నేతలు కూడా ఆయనను చూసి షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: