ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అసలు బిజెపి వైఖరి ఏంటీ అనే దానిపై ఏ విధమైన స్పష్టత కూడా ఇప్పటి వరకు రాలేదు. అసలు ఆ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉంది అనే దానిపై అసలు ఏం చెప్పలేదు. ఎన్నికల విషయంలో బిజెపి మిత్రపక్షం జనసేన కూడా తన స్పందన బయటపెట్టిన పరిస్థితి లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఒక ట్వీట్ చేసారు. ఆంధ్రలో స్థానిక సంస్థల ఎన్నికలు...  వాయిదా పడే సమయానికి ఎంపీటీసీలు మెుత్తం 10047 గాను 2363 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అంటే దాదాపుగా 25% అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అనాడు అనేక చోట్ల బిజెపి కార్యకర్తల మీద, ఇతర ప్రతిపక్ష పార్టీల మీద నామినేషన్ దాఖలు చేయకుండా వైసిపి దాడి చేసింది అని ఆయన ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేయకుండా దాడి అధికార వైసీపీ వారు చేశారని అనాడు ఇదే ఎన్నికల కమిషన్ కు బిజెపి ఫిర్యాదు చేసినా నోరు మెదపలేదు. వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు అని ఆయన మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా జరగలేదు అనడానికి ఇంత కంటే సాక్ష్యం ఏం కావాలి? అని ఆయన నిలదీశారు. ఎన్నికల కమిషన్ నేడైనా నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు.

కాగా నేడు అఖిలపక్ష సమావేశం ఏపీ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయం చెప్పాలి అని ఎన్నికల సంఘం కోరుతుంది. అయితే జనసేన, బిజెపి మాత్రం ఈ అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండటం తో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: