ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తూ ఎంతో మంది పై పంజా విసురుతు.. ప్రాణాలు బలి తీసుకుంటున్న కరోనా.. కేసుల సంఖ్య ఎక్కడా తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే మొదట కేవలం దగ్గు జలుబు జ్వరం లాంటి లక్షణాలు మాత్రమే కరోనావైరస్ లక్షణాలుగా ఉండగా ఇప్పుడు రోజురోజుకీ కరోనా
వైరస్ సోకిన బాధితుల్లో  కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తుండటం  భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. మానసికంగా శారీరకంగా కూడా కరోనా వైరస్ బాధితులు ఎన్నో మార్పులు వస్తూ కొత్త సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. కరోనా వైరస్ బాధితుల్లో  తెరమీదికి వస్తున్న కొత్త సమస్యలను తెలుసుకునేందుకు ముమ్మరంగా పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి.



 ఇటీవలే మహమ్మారి కరోనా వైరస్ గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ బారిన పడిన ఓ వైద్యుడు చర్మం  మొత్తం పూర్తిగా నల్లగా మారి పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలల తర్వాత సాధారణ రంగు లోకి వచ్చింది అతని చర్మం. ఇక ఇది జరిగింది ఎక్కడో కాదు వైరస్ పుట్టినిల్లు మూల కేంద్రమైన వుహాన్  నగరంలోనే. వుహాన్ లో  హృద్రోగ నిపుణుడిగా పని చేస్తున్నాడు లూ ఫ్యాన్.. కరోనా  రోగులకు చికిత్స అందించే క్రమంలో కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో  ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు.



 దాదాపు ముప్పై తొమ్మిది రోజుల తర్వాత కరోనా వైరస్ నుంచి బయటపడ్డాడు సదరు వైద్యుడు. అయితే కరోనా చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆ వైద్యుడి చర్మం మొత్తం పూర్తిగా నల్ల రంగులోకి మారిపోయింది. దీంతో ఆ వైద్యుడు ఎంతగానో ఆందోళన చెందాడు. ఇక ఆ తర్వాత కరోనా వైరస్ నుంచి బయటపడ్డాక కొన్ని నెలల తరువాత మళ్ళీ పూర్వపు రంగులోకి వచ్చేసింది ఆ వైద్యుడు చర్మం. ఇక దాదాపు ఐదు నెలల తర్వాత తిరిగి విధులకు హాజరయ్యాడు సదరు డాక్టర్. మెరుగైన వైద్యం అందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకున్న కారణంగానే అతని  చర్మం నల్లబడి ఉందని అతనికి చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: