ప్రముఖ ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకింగ్ సంస్థ కోటక్ మహేంద్ర బ్యాంక్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల సేవలను తమ కస్టమర్లకు అందిస్తుంది కోటక్ మహేంద్ర బ్యాంక్. కష్టమర్లందరికీ ఆర్థికంగా చేయూత అందించే విధంగా వివిధ రకాల ఆకర్షణీయమైన స్కీమ్లను అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోటక్ మహేంద్ర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల సదుపాయాన్ని కూడా తమ కస్టమర్లకు అందించిన విషయం తెలిసిందే.



 ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్న కోటక్ మహేంద్ర బ్యాంక్ కస్టమర్లందరికీ ఝలక్ ఇచ్చింది. వడ్డీ రేట్లు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో డబ్బులు దాచుకునే వారిపై ఈ  నిర్ణయంతో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు నిర్ణయాన్ని అక్టోబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కోటక్ మహేంద్ర బ్యాంక్ తెలిపింది. దీంతో ప్రస్తుతం mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కొటక్ మహీంద్రా బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునేవారికి గతంలో కంటే తక్కువ రాబడి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొత్త వడ్డీరేట్ల ప్రతిపాదికన చూస్తే ఇప్పుడు mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కొటక్ మహీంద్రా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.5 శాతం లేదా ఐదు శాతం మధ్యలో వడ్డీ లభిస్తుంది.



 దేశంలోని ఏడు రోజుల నుంచి 30 రోజులు, 31 రోజుల నుంచి 90 రోజులు. 91 రోజులనుంచి 179 రోజులు కాల పరిమితి వ్యవధిలో మెచ్యూరిటీ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వరుసగా 2.5, 3, 3.5 శాతం వడ్డీరేట్లను చెల్లించేందుకు నిర్ణయించింది. ఇక 180 రోజుల నుంచి ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.5 శాతం వడ్డీ రేటు అందిస్తుంది కోటక్ మహేంద్ర బ్యాంక్. ఇలా అన్ని రకాల కాల పరిమితులు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకొని కస్టమర్లు  అందరికీ ఝలక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: