కరోనా మహమ్మారి ప్రజలందరినీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇది  ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఇప్పటికే దీని  భారిన పడి చాలా చిన్న వయస్సు వారు కూడా చనిపోయారు. అలాంటిది ఒక వృద్ధురాలు కరోనాని జయించారంటే  ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. వివరాల్లోకి వెళితే...

నిజంగా వృద్ధులు జయించడం గొప్ప విషయమే. స్పెయిన్‌కు చెందిన 113 ఏళ్ల వృద్ధురాలు కూడా కరోనాను జయించింది. ఎంత గ్రేటో కదా...! శాన్‌ఫ్రాన్సిస్కో లో జన్మించిన తాను బ్రాన్యాస్ స్పెయిన్‌ లో స్థిరపడ్డారు. ఈమె ఆ దేశంలో అధికారికంగా అతి పెద్ద మహిళగా ఆమె రికార్డు కి ఎక్కింది. ఆమెకు ఏప్రిల్ ‌లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ వచ్చింది. దీనితో ఆమెని ఆసుపత్రిలో చేర్చగా ఆమె కొన్ని రోజుల్లోనే కరోనని జయించింది. కేవలం ఇది ఒక్కటే కాదు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. 103 ఏళ్ల జెన్నీ స్టెంజాకు కరోనా సోకింది. కరోనా రావడం తో  హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకోగా.... అనంతరం కరోనా నెగెటివ్‌ రాగానే హాస్పిటల్ బెడ్‌ పైనే కూల్ ‌బీర్‌ ఓపెన్ ‌చేసి తాగడం జరిగింది. ఈ సంఘటన చూసిన సదరు బంధువులు తన ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చెయ్యడం జరిగింది. అప్పటి నుండి  ఆ ఫొటో వైరల్‌ అయ్యింది. ఇలా కరోనాను జయించానని  చేసిన పనికి  ఆనందానికి ఇదే సంకేతమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు నేటిజన్లు.

ఇలానే ఇరాన్‌కు చెందిన 103 ఏళ్ల బామ్మ కూడా కరోనా నుండి కోలుకుంది. వారం రోజుల పాటు  ఆమె సెంట్రల్ సిటీ సెమ్నాన్‌లో  చికిత్స తీసుకుంది. ఆ తరువాత ఆమె పూర్తిగా కోలుకుని  డిశ్చార్జ్ అయ్యింది అని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది. ఇలా వృద్ధులు కూడా కరోనా నుండి కోలుకోవడం ఎంతో మంచి విషయం కదా...!
 

మరింత సమాచారం తెలుసుకోండి: