అవునూ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ విషయాన్ని పూర్తి చేసి తర్వాత మర్చిపోయాడట.. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం మర్చిపోవడం లేదట. అయితే ఇంతకీ ఏంటా విషయం? మరి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అంత ఈజీగా మర్చిపోయారు? చంద్రబాబు నాయుడు ఎందుకు మర్చిపోవడం లేదు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ విషయం గురించి పెద్దగా ఆలోచించరు. పని పూర్తి చేసేశామా.. ఇక అంతే. అయితే ప్రతిపక్షాలు, శత్రువులు ఎన్ని విమర్శలు చేసినా చూస్తూ ఊరుకుంటారు. మొన్నటికి మొన్న సుప్రీం కోర్టు జడ్జిపై జగన్‌ రాసిన లేఖనే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. న్యాయవ్యవస్థలో జరుగుతున్న అన్యాయంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దానికి సంబంధించి పలు ఆధారాలను కూడా జత చేశారు. కానీ.. ఆ విషయాన్ని అంతటితో జగన్‌ మర్చిపోయారు. అయితే కొందరు టీడీపీ నేతల నుండి మాత్రం నుంచి ఎదురుదాడి జరుగుతూనే ఉంది. అయినా జగన్‌ మాత్రం ఎలాంటి ప్రతి దాడులకు వెళ్లడం లేదు. అంతేకాదు, వైసీపీ నాయకులను కూడా ఈ విషయంపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే.. టీడీపీలోని ఓ సీనియర్‌ నాయకుడు మాట్లాడుతూ.. "మా నాయకుడికి ఆలోచనతోపాటు భయం కూడా ఉంది. గతంలో ఓటుకు నోటు కేసులో తన పేరు రాగానే వెంటనే మీడియా మీటింగ్ పెట్టి.. వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగారు. కానీ, ఇప్పుడు ఆ ఛాన్స్ లేకపోవడం.. పైగా నేరుగా తనకు సంబంధించిన వ్యక్తులతో ఈ విషయంపై మాట్లాడితే.. ఇంటలిజెన్స్ నిఘా వర్గాలు పసిగడతాయేమోనని కూడా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది" అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ.. "ఇప్పుడు మా బాబైనా.. మేమైనా చేయగలిగింది ఏమీ లేదు. జరగాల్సింది జరుగుతుంది. మేం పనిగట్టుకుని మాట్లాడినా.. బాబును వెనుకేసుకువచ్చినా.. లాభం లేదు. సో.. ఇప్పుడు బాబు దీనిపై మౌనంగా ఉండడం బెటర్" అని సలహా ఇచ్చాడు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: