తిరుపతి ఉప ఎన్నిక కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.. ముహూర్తం పెట్టడమే ఉంది.. అయితే అప్పుడే ఎన్నికలు దగ్గరికొచ్చేనట్లు ఇక్కడి ప్రతిపక్షాల ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. టీడీపీ అయితే ఎక్కడ తమ ఉనికి కోల్పోతుందో అని వైసీపీ ఓడించాడనికి బీజేపీ తో చేతులు కలపడానికి సైతం సిద్ధంగా ఉంది.. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోడీ కి, టీడీపీ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన పోరాటానికి మోడీ దిగి రావాల్సి వచ్చింది. అయితే ఆ పోరాటం వల్ల  చంద్రబాబు పై కొంత సింపతీ కూడా వచ్చింది..

కానీ ఓట్లు మాత్రం జగన్ కె వేశారు.. వాస్తవానికి చంద్రబాబు అండ్ కో బీజేపీ పై చిన్న పాటి యుద్ధం చేశారని చెప్పొచ్చు.. ప్రత్యేక హోదా ఇస్తారా చస్తారా అన్న నినాదాన్ని జనాల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న సూక్తిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు కానీ ప్రజలు నమ్మనట్లే మోడీ కూడా చంద్రబాబు ను నమ్మి ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. ఇదిలా ఉంటె తిరుపతి ఉప ఎన్నిక లో గెలిచి టీడీపీని ఖాళీ చేసి అర్జెంట్ గా రెండో స్థానానికి చేరాలని బీజేపీ ఆశిస్తోంది. దానికి అనుగుణంగా బీజేపీ కార్యాచరణ సాగుతోంది. అలాంటి సమయంలో ఉప ఎన్నికల్లో టీడీపీ పక్కకు తప్పుకోవడం ద్వారా నేరుగా బీజేపీకి ఆ స్థానం దక్కినట్టే అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక  ఉపఎన్నికల్లో పోటి చేయటానికి పార్టీలు అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్నాయి. ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటూ అందరికన్నా ముందు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. నిజానికి ఇక్కడ పోటి చేసే గెలిచేంత సీన్ బీజేపీకి లేదన్న విషయం అందరికీ తెలుసు. అయితే జనసేన నుండి ఈమధ్య బీజేపీలో చేరిన మాజీమంత్రి రావెల కిషోర్ బాబు పోటీ చేసే విషయంలో బాగా ఆసక్తిగా ఉన్నారట.. ఈ నేపధ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత పనబాక లక్ష్మి టీడీపీకి రాజీనామా చేసేసి కమలం కండువా కప్పుకోబోతున్నట్లు తెలిసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి పనబాక బాగా క్లోజ్ ఫ్రెండట. దాంతో పనబాక బీజేపీలో చేరి తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి దాదాపు లైన్ క్లియర్ అయిపోయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఇద్దరిలో టికెట్ ఎవరికీ దక్కుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: