టీడీపీ, బీజేపీ లాంటి పెద్ద పెద్ద పార్టీ లోని నాయకులే వైసీపీ ని, జగన్ ని పెద్దగా మాటలానలేకపోతున్నారు.. అలాంటిది ఎన్నికల కమిషనర్ అయినా నిమ్మగదా రమేష్ అధికారంలో ఉన్న మాటను ఏమాత్రం లెక్కచేయకపోవడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి గా మారిపోయింది.. రాష్ట్రంలో మరో ప్రతిపక్షం గా తయారైన నిమ్మగడ్డ రమేష్ఇటీవలే సుప్రీం కోర్టు కి వెళ్లి మొట్టికాయలు తిన్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వం పై కోర్టు కెక్కి కాలయాపన చేసి ప్రభుత్వం టైం ని వేస్ట్ చేసిన నిమ్మగడ్డ కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించవద్దని పట్టుపట్టి మరీ ప్రభుత్వాన్ని ఎదురించి కోర్టులో కేసు వేసి చేతులు కాల్చుకున్నాడు..

ఎన్నికల కోడ్ తొలగించాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించి ముందుకెళ్లాలని ఆదేశాలు కూడా అందుకున్నారు. అయినా ఇప్పుడు ఆయన కోర్టు ధిక్కారణకు పూనుకున్నట్టు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం సెహెస్తున్నారు.. ప్రతిపక్షాల అండతో  స్థానిక ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తున్నారు. మరోసారి వివిధ రాజకీయ పక్షాలతో భేటీ జరుపుతున్నారు. అయితే ఈ భేటీకి తాము హాజరుకాబోమని ఇప్పటికే పార్టీ స్పష్టం చేసింది..

అయినా నిమ్మగడ్డ ఎవరి మాట వినకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు.. సహజంగా రాజకీయ పక్షాలతో ఎన్నికల సంఘం సంయుక్త సమావేశాలు నిర్వహిస్తుంది. అన్ని పార్టీల అభిప్రాయాలను బహిరంగంగానే స్వీకరిస్తున్నారు. ఆయా పార్టీలు తమ విధానాలు, రాజకీయ అవసరాల ఆధారంగా తమ అభిప్రాయం చెప్పడం, మరిన్ని సూచనలు చేయడం చాలాకాలంగా వస్తున్న ఆనవాయితీ. కానీ నిమ్మగడ్డ మాత్రం దానికి భిన్నమైన దారిలో సాగుతున్నారు. ఈసారి రాజకీయ పక్షాల భేటీ ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో పార్టీని వరుసగా పిలుస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు ఒక్కొక్కరితో ఎస్ఈసీ సమావేశమవుతారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: