దుబ్బాక ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు  సమాయత్తమవుతున్నాయి.. ప్రతిపక్షాల విమర్శలతో, ధర్నాలతో  రోజు రోజు కి అక్కడ రాజకీయ వాతావరణం మారిపోతుంది.. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ అక్కడ అధికార పార్టీ పై దుమ్మెత్తి పొస్తుండగా బీజేపీ కూడా తెరాస ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది.. నిజానికి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అక్కడి రాజకీయం కాస్త వేడిగా మారిపోయింది అని చెప్పొచ్చు..ఇతర పార్టీ లు ప్రత్యర్థి పార్టీ పై విమర్శలు చేస్తూ ఎదుటి పార్టీ ని కృంగదీసే ప్రయత్నం చేస్తున్నాయి.. చేరికలు ఒక పార్టీ నుంచి మరో పార్టీ కి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏ పార్టీ ఎప్పుడు పుంజు కుంటుందో అర్థం కావట్లేదు.

అధికార పార్టీ పూర్తి గా హరీష్ రావు ని ఎప్పటినుంచొ ఇక్కడే ఉంచి పార్టీ గెలుపుకోసం కృషి చేయిస్తుంది.. అయన తన సొంత నియోజకవర్గంలా ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నారు.. కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై శ్రద్ధ వహించగా, కేటీఆర్ గ్రేటర్ పై దృష్టి సారించారు.. దాంతో హరీష్ రావు కి దుబ్బాక ని ఇచ్చారు.. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ గెలుపు ఢంకా మోగించాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారట.. అయితే హరీష్ రావు కి ఇక్కడి బాధ్యతలు ఇచ్చినప్పటికీ కేసీఆర్ ఇక్కడ ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది..

లక్ష మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నానని హరీష్ రావు చెబుతున్నారు. ఆ దిశగా ఆయన తనదైన శైలిలో వ్యూహం రచిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ని ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారని అంటున్నారు.. గతంలో కేసీఆర్‌ సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలోని 11 గ్రామాలు ఇప్పుడు దుబ్బాకలో ఉన్నాయి. ఇప్పుడు సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ సైతం దుబ్బాక పక్కనే ఉంటుంది. గడువు ముగిసే చివరి రోజుల్లో కేసీఆర్‌తో బహిరంగసభ పెట్టించాలనే ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్‌ కూడా ప్రచారం చివరికి వచ్చేటప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: