తెలంగాణ లో ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ పార్టీ దుబ్బాక లో గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది.. ఇప్పటికే దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రెడ్డి తో కేసీఆర్ పై పలు విమర్శలు చేయిస్తున్న బీజేపీ పార్టీ ఇప్పుడు ఓ ప్రణాళిక ప్రకారం ఇక్కడ ప్రచారానికి సిద్ధమవుతుంది.. సోమవారం సోదాల ఫలితం ఎన్నో విమర్శలకు దారితీసింది.. టీఆర్ఎస్, బీజేపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దుబ్బాక‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను బీజేపీ సీరియ‌స్ గా తీసుకుంది. దాన్ని తీవ్రంగా ప‌రిఘ‌టిం తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి సైతం సిద్దిపేట‌కు వచ్చి పరిస్థితి ని గమనించారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధ్యలోనే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇవన్నీ జరుగుతుండగానే ప్రచారాలు జరుగుతుండడం కురులు..

ఓవైపు బీజేపీ  బలపడుతుండడం, కాంగ్రెస్ దూకుడు వెరసి టీఆర్ఎస్ కి దుబ్బాక లో గెలుపు అవకాశాలు రోజు రోజు కి సన్నగిల్లు తు వస్తున్నాయి..  ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికకు అంతా సిద్ధమయింది అని చెప్పుకోవాలి. ఎన్నిక కోసం అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి.  ఇప్పటికే దుబ్బాకలో ప్రచారాన్ని అందరూ మొదలుపెట్టారు. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి అభ్యర్థిని ప్రకటించకున్నా గ్రామస్థాయిలో నేతలను నియమించింది. ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇన్ ఛార్జిగా హరీశ్ రావును పార్టీ అధిష్టానం నియమించింది. హరీశ్ రావు దుబ్బాక నియోజకరవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ని తొక్కేసే విధంగా బీజేపీ పార్టీ సరికొత్తగా ప్రచారాన్ని మొదలుపెట్టింది..  

న‌వంబ‌ర్ 3న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. కొద్ది రోజులే స‌మ‌యం ఉండ‌డంతో తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఇక నుంచి తీసుకోవాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై  బీజేపీ చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. ర‌ఘునంద‌న్ ను వివాదాలు చుట్టుముడుతుండ‌డంపై దాని నుంచి బ‌య‌ట‌ప‌డి పార్టీ విధానాల‌ను, కేంద్ర‌ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ఇక‌పై మ‌రింత ప‌క్కాగా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. అవ‌స‌ర‌మైతే కేంద్ర పెద్ద‌ల స‌హ‌కారం కోరాల‌ని, ప్ర‌ముఖుల‌తో ప్ర‌చారం చేయించాల‌ని కార్య‌వ‌ర్గం నిర్ణ‌యించింది. ఆ బాధ్య‌త‌ను బండి సంజ‌య్ కు అప్ప‌గించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: