తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలు ఏ రేంజ్ లో హీట్ పెంచుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఇప్పుడు ఈ ఎన్నికల కోసం చాలా వరకు కూడా ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో విజయం సాధించే పార్టీ ఏది అనేదానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికల రాజకీయంపై కొంతమంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ సంగతి పక్కన పెట్టి కాసేపు... ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మారాలి అని భావిస్తూ అంతేకాకుండా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ రాజకీయం ఒక్కసారి చూస్తే దుబ్బాకలో కాస్త ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి.

ప్రధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో కాస్త సీరియస్ గా  ఫోకస్ పెట్టారు. బండి సంజయ్ అరెస్టు చేసిన సమయంలో ఆయన నేరుగా అక్కడికి వెళ్లడంపై ఇప్పుడు కొంత మంది విమర్శలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఒక ఎమ్మెల్యే ఎన్నిక కోసం ఈ స్థాయిలో సమయాన్ని వెచ్చించడం కరెక్ట్ కాదు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కిషన్ రెడ్డి మాత్రం ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే కచ్చితంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవచ్చు అనే భావనలో బిజెపి ఉంది. మంత్రి హరీష్ రావు ని టార్గెట్ గా చేసుకుని ఇప్పుడు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక హరీష్ రావు ఎదుర్కొని ఇప్పుడు తెలంగాణలో బిజెపి విజయం సాధించింది అంటే కచ్చితంగా ఆ క్రెడిట్ బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డికి దక్కుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో వీరిద్దరు కూడా విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా వీరి సామర్థ్యాన్ని గుర్తించి అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: