ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కాస్త గట్టిగానే కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని విపక్షాలు కూడా కాస్త గట్టిగానే పట్టుదలగా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అయితే అధికార పార్టీకి కొన్ని పరిస్థితులు మాత్రం కాస్త ఇబ్బందికరంగా మారాయి అనే మాట అక్షరాలా నిజం. ప్రధానంగా కొంతమంది నేతల తీరుపై సీఎం జగన్ కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు.

ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా పడే అవకాశాలు ఉండవచ్చు అని చాలా వరకు కూడా రాజకీయ వర్గాల్లో  అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనితో ఇప్పుడు సీఎం జగన్ కూడా నష్ట  నివారణ చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన పార్టీలో ఒక కమిటీ వేసి అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి సీఎం జగన్ ఒక కమిటీని ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

పార్టీ సీనియర్ నేతలతో కలిసి చర్చించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఐదుగురు సభ్యులు కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కొంత మంది ఎమ్మెల్యేలతో అదేవిధంగా నియోజకవర్గాల ఇన్చార్జిలు తో సమావేశమైన తర్వాత ఎన్నికలపై ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ప్రచారం ఏ విధంగా చేయాలి అనే దానిపై కూడా ఈ కమిటీ పలు సూచనలు చేసే అవకాశం ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: