ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి బలపడే విధంగా పరిస్థితులు ఉన్నాయా లేదా అనే విషయం పక్కన పెడితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ చాలావరకు ఇబ్బంది పడుతుంది అనే మాట అక్షరాలా నిజం. ప్రధానంగా కొంతమంది పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైకి చెప్పకుండా లోపల బాగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర కమిటీ ప్రకటన విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి అడుగు కూడా ముందుకు వేయలేదు.

 దీంతో అసలు రాష్ట్ర కమిటీ లో ఎవరు ఉంటారు ఏంటి అనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే ఇప్పుడు ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రధానంగా కొంత మంది కార్యకర్తలతో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి సమావేశమైన తర్వాత కొంతమంది నాయకులకు పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు చెందిన కొంతమంది నేతలపై కార్యకర్తలు చాలా అసహనంగా ఉన్నారు. ప్రజా ఉద్యమాలు చేసే విషయంలో కార్యకర్తలకు బయటకు వస్తున్నా సరే నేతలు బయటకు రాకపోవడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు.

దీనితోనే కొంతమందికి సంబంధించి ఇప్పుడు కార్యకర్తలు అభిప్రాయం తీసుకుని తద్వారా ముందుకు వెళ్లే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ రాష్ట్ర కమిటీ లో కొంతమంది కీలక నేతల పేర్లు ఉండే అవకాశాలున్నాయి. వారి మీద కూడా కార్యకర్తలు అభిప్రాయం తెలుసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి రాష్ట్ర కమిటీలో ఎవరికి బాధ్యత అప్పగిస్తారు ఏంటి అనేది చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: