అబద్ధమనే దానికి పర్యాయ పదమే ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా అత్యున్నత పదవిలో ఉన్న ట్రంప్.. అలవోకగా అసత్యాలు చెప్పడంలో ఆయనకు  మించినోడు లేడు. ఇంతకీ ఆయన భార్య విషయంలో కూడా అంతే  అబద్ధం చెప్పారా..? ట్రంప్ పక్కన కనిపిస్తున్న మెలానియా.. అసలు మెలానియా కాదా..? ఇప్పుడివే అనుమానాలు కలుగుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. గత కొన్ని రోజులుగా ట్రంప్ తన వెంట మెలానియాను పోలికలతో ఉన్న మరో మహిళను తీసుకెడుతున్నారంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, మీమ్స్  హల్ చల్ చేస్తున్నాయి. ఈ అజ్ఞాత మహిళకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ నెల 22న టెన్నెస్సె స్టేట్‌లోని నాష్‌విల్లేలోని యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డిబేట్‌కు హాజరు కావడానికి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో బయలుదేరడానికి ముందు తీసిన ఫొటో తాజా వివాదానికి కారణమైంది.

ఎయిర్ క్రాఫ్ట్‌లోకి అడుగు పెట్టడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తన అభిమానులకు అభివాదం చేస్తోన్న సమయంలో ఆయన పక్కనే నిల్చుని కనిపించారామె. ఈ ఫోటోలను పరిశీలించిన వారు ఆమె మెలానియా కాదని, మరో మహిళ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎవరా ఆ అజ్ఞాత మహిళ అంటూ 'ఫేక్ మెలానియా' హ్యాష్‌ట్యాగ్‌ను ట్యాగ్ చేస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య ప్రథమ మహిళ మెలానియీ ఇటీవల కరోనా బారిన పడ్డారు. అయితే మిలటరీ ఆసుపత్రిలో చికిత్స  అనంతరం కోలుకున్న ట్రంప్ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు.  విపరీతమైన దగ్గు కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కీలకమైన సమావేశానికి హాజరు కాలేకపోతున్నారంటూ ఆమె ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ట్రంప్ మరో వివాదం చిక్కుకున్నారు. తన భార్యగా మరో మహిళను తిప్పుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: