రాష్ట్ర ఎన్నికల  కమిషనర్ తో రాజకీయ పార్టీల నేతల సమావేశం ముగిసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై తమ పార్టీల అభిప్రాయాలను తెలిపిన రాజకీయ పార్టీలు... పలు సూచనలు కూడా చేసాయి. అభిప్రాయాలను లేఖ ద్వారా  అభిప్రాయాలు రాజకీయ పార్టీలు తెలిపాయి. ఈ సమావేశానికి హాజరై అభిప్రాయాలు 10 రాజకీయ పార్టీలు చెప్పాయి. తెదేపా, భాజపా, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బిఎస్పీ, జనతాదళ్, ముస్లిం లీగ్, సమాజ్ వాద్, ఎ ఐ డీఎం కే  పార్టీ నేతలు  హాజరయ్యారు. ఈ మెయిల్ ద్వారా ఎస్ ఈ సి కి తమ పార్టీ అభిప్రాయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది.

సమావేశానికి అధికార వైకాపా , మరో 7 రాజకీయ పార్టీల నేతలు హాజరు కాలేదు. ఇక దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. అభిప్రాయాలు తెలిపేందుకు 11 పార్టీలు హాజరయ్యాయి అని ఆయన అన్నారు. రెండుపక్షాలు లిఖితపూర్వక సమాధానాలు పంపాయి అని చెప్పారు. ఆరు రాజకీయపక్షాలు హాజరుకాలేదు అని అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటంనేని శ్రీధర్ తో చర్చలు జరిపినట్టు ప్రకటించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ నీలం సాహ్ని అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నాం అని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని తెలుసుకొనేందుకు కమిషన్ ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించడంలేదని వైసీపీ నేతలు చేసిన ప్రకటనలు నిజంకాదు అని ఆయన అన్నారు. అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నాం అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానాల్నే రాజకీయపక్షాల గుర్తింపు, సంప్రదింపుల ప్రక్రియలో అమలు చేశాం అని ఆయన అన్నారు. కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలను పాటించాం అని స్పష్టం చేసారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా పాటించింది అని ఆయన వివరించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్ట్ లో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంలో సమాధానం దాఖలు చేసేందుకు ఈ ప్రక్రియను చేపట్టామని ఆయన వివరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: