టిడిపి హయాంలో రైతులకు ఎటువంటి న్యాయం జరిగిందో చెప్పాలని ఇటీవల ఒక వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.. అధికారం ఉన్నంతవరకు బాబు నత్త నడకగా ప్రజలకు పథకాలను అమలు చేశారు. టిడిపి ప్రభుత్వం వల్ల చాలా నష్టపోయినట్లు ప్రజలు చాలా సందర్భాల్లో చెప్పారు. బాబు అవినీతి పై ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన పాద యాత్రలో టీడీపీ మోసాల గురించి బయటపడిందని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం నిధులను తీసుకున్న టీడీపీ స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్లు తేలింది.



అందుకు కారణాలు కూడా చాలానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయట పెట్టింది. అయితే వాటికి మాత్రం టీడీపీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అవినీతి చేసినట్లు తెలుస్తుంది. 'తాను చెడ్డ కోతి వనమంతా చెరిచేను '.. అనే సామెతకు సరిగ్గా షూట్  అయ్యేలా టీడీపీ అధికారులు వైసీపీ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలలో లోపాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు.



ఈ విషయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. టిడిపి బాబు చంద్రబాబు అవినీతి చిట్టాలను బయట పెట్టారు. వాటి విషయానికొస్తే.. ఆయన భార్య పేరు మీద భువనేశ్వరి కార్బైట్స్ అండ్ కెమికల్ కంపెనీని స్థాపించారు.. అందుకోసం రేణిగుంట లోని ఐదు ఎకరాల స్థలాన్ని తాకట్టు పెట్టారు.. ఆ పొలం ఎవరిది అనేది మాత్రం తెలియలేదు. ఇక 1989 లో రామా అగ్రికల్చర్ పేరిట కొండాపూర్ లో బాబు కుటుంబం 3278 ఎకరాలను కొనుగోలు చేసింది. ఆ భూమిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వారికి అమ్మేశారు.  ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర ప్రదేశ్ ను ఊడ్చేసారని తెలుస్తుంది.. అంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.. ఈ విషయం పై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: