ఆర్బీఐ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక రుణాలు మాఫీ చేసిన రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది అని మంత్రి కేటిఅర్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 27, 718 కోట్ల రుణాలు మాఫీ చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. రైతు బంధు రూపంలో 28వేల కోట్లు రైతులకు అందించాము అని మంత్రి కేటిఅర్ తెలిపారు. మొత్తంగా 56వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాము అన్నారు. ఇది వ్యవసాయ బడ్జెట్ కు అదనం అన్నారు. ఇది మా కమిట్ మెంట్ కు నిదర్శనం అని ఆయన చెప్పుకొచ్చారు. అప్పులు పెరిగాయి అని గొంతుచించుకునే వారు తలసరి ఆదాయం పెరిగిందన్న విషయాన్ని మరవద్దు అన్నారు.

60లక్షల రైతు కుటుంబాలకు రెండున్నర కోట్ల మందికి మేలు జరిగిందని మంత్రి కేటిఅర్  తెలిపారు. ఆర్బీఐ రిపోర్ట్ ను దివాలకోరు ప్రతిపక్షాలు గుర్తిస్తాయో లేదో అని ఆయన ఎద్దేవా చేసారు. జార్ఖండ్, ఛతీస్ఘడ్ ఇప్పుడు అసెంబ్లీ కట్టుకుంటున్నాయని, తెలంగాణ వేగంగా ముందుకు వెళుతోంది అన్నారు. అందుకే ఏ ఎన్నిక జరిగిన అసాధారణ మద్దతు కేసీఆర్ కు లభిస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. దుబ్బాకలో కూడా ఫలితాలు భిన్నంగా ఉండవన్నారు. గతంలోకంటే మెరుగైన మెజారిటీ తో గెలుస్తాం అని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కు డిపాజిట్ లు కూడా రాకపోవొచ్చు అన్నారు.

బీజేపీ సమాజంలో తక్కువ సామాజిక మాధ్యమం లో ఎక్కువ అని మంత్రి కేటిఅర్  విమర్శించారు. బీజేపీ మాటలు ఎవ్వరు నమ్మరు, చెవిలో పువ్వు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరన్నారు. దుబ్బాక ఉద్యమాల గడ్డ, అక్కడ ప్రజలు చైతన్య వంతులని ఆయన పేర్కొన్నారు. పోలీస్ అధికారి పై బీజేపీ నేతల దూషణలు ఖండిస్తున్నాం అని ఆయన విమర్శించారు. మేము కూడా ప్రధాని, మంత్రులను వదలం, కడిగిపరేస్తాం అన్నారు. అడ్డగోలుగా మాట్లాడుతే సహించం, మేము కూడా బూతులు మాట్లాడగలం అన్నారు ఆయన. సీఎం పై విమర్శలు రికార్డ్ చేస్తున్నాం..సమయం వచ్చినప్పుడు చెబుతాం అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఢిల్లీ టూ గల్లీ ఖాళీ అయిందని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: