దుబ్బాక నియోజకవర్గం  చేగుంట మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు ఉండగా తిన్నది అరగక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని బీజేపీ వాళ్ళు అన్నారు అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అన్నాడు నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశాడు అని ఆయన వివరించారు. కాంగ్రెస్ అంటే కాలిపోయే కరెంట్, బీజేపీ బాయికాడ మీటర్లు... టిఆర్ ఎస్ అంటే 24 గంటల కరెంట్ అని ఆయన వ్యాఖ్యానించారు.

27 ఏప్రిల్ 2020 నాడు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక  బిల్లు తెచ్చింది అని ఆయన తెలిపారు. 17 మే సబ్సిడీ లేకుండా బిల్లు ఇవ్వాలి అని కేంద్రం  రాష్ట్రానికి లెటర్ రాసింది అని ఆయన అన్నారు. జూన్ 2 మీటర్లు పెట్టము అని సీఎం కేంద్రానికి లెటర్ రాశారు అని పేర్కొన్నారు. బాయిల కాడ మీటర్లు పెట్టి రైతుల చేతిలో బిల్లు పెడితే 2500 కోట్లు ఇస్తామని చెప్పారని ఆయన వివరించారు. మీ డబ్బులు వద్దు, మీ మీటర్లు వద్దు మా రైతుల పానాలే మాకు ముఖ్యమన్నారు కేసీఆర్ అని కొనియాడారు.

మీటర్ల వద్దంటే 300 మీటర్ల లోపల బీజేపీ ని పాతర పెట్టాలి అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ టైం లో ఎప్పుడు కరెంట్ వస్తదో తెలియక బాయిల కాడనే కాపు కాసేటోల్లమ్ అన్నారు. మడి ఎండకుండా కాంగ్రెస్ హయాంలో ఒక్కసారైనా పంట పండిందా ? అని ఆయన నిలదీశారు. బీజేపీ మార్కెట్లును ప్రయివేట్ పరం చేస్తాం.. రైతుకు మద్దతు ధర లేకుండా చేస్తామని బీజేపీ బిల్లు తెచ్చింది అని విమర్శించారు. విదేశీ మక్కలు తెస్తే ఇక్కడి మక్కలు ఎవరు కొంటారు అని ఆయన ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాలు కోసం బీజేపీ పని చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ బిల్లుకు వ్యతిరేకంగా దేశమంతా అట్టుడుకుతున్నదని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: