సమాజంలో కొందరు గురువులుగా చలామణి అయ్యి, వారి అవసరాలకోసం అమాయక జనాన్ని వాడుకుంటూ వుంటారు. ఈ క్రమంలో నిత్యం సమాజంలో జరిగే అనేక మోసాలను మనం చూస్తూ వున్నాం. వీరి ఉచ్చులో సామాన్య జనమే కాకుండా బడా రాజకీయ నేతలు, సినిమా సెలిబ్రిటీలు కూడా పడుతూ వుంటారు. ఆ తరువాత ముఖ్యంగా మహిళలను వీరు చాలా ఈజీగా టార్గెట్ చేసి వారికి బానిసలుగా మార్చుకుంటూ వుంటారు. సరిగ్గా ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. వివరాలు ఇలా వున్నాయి..

సమాజానికి తనకి తాను ఓ గురువుగా పరిచయం చేసుకొని, లైఫ్‌ కోచింగ్‌ పేరుతో పలువురు స్త్రీలను సెక్స్  బానిసలుగా మార్చి తన రాక్షస లైంగిక వాంఛలను తీర్చుకునే 60 ఏళ్ల కీత్‌ రనీర్ కు న్యూయార్క్‌ జడ్జి నిన్న మంగళవారం 120 సంవత్సరాలు (జీవిత ఖైదు) జైలు శిక్ష ఖరారు చేసారు. మహిళలను తనతో బలవంతంగా లైంగిక సంబంధాలు నెరిపేలా రుజువు కావడంతో ఈ దుస్థితి పట్టింది.

ఇకపోతే, 5 రోజుల సెల్ప్‌ హెల్ప్‌ కోర్సుల నిమిత్తం ఒక్కొక్కరి దగ్గర సుమారు 5000 డాలర్లను ఈ సంస్థ ముక్కు పిండి వసూలు చేస్తుంది. కోర్సులో భాగంగా DOS పేరిట పిరమిడ్‌ గ్రూపును ఏర్పాటు చేసి, వారిని సెక్స్‌ బానిసలుగా చేసిన తరువాత తనకు తాను గ్రాండ్‌ మాస్టర్‌గా చెప్పుకొని అనంతరం వారితో లైంగిక సంబంధాలు నెరిపేవాడు. ఈ క్రమంలో వారి వ్యక్తిగత సమాచారం, అసభ్యకర ఫోటోలను జాగ్రత్తగా తన ఫోనులో భద్రపరిచేవాడు.

ఇకపోతే.. రవీన్‌పై దోపిడీ, నేరపూరిత కుట్ర, మహిళల అక్రమ రవాణా, బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు కావడంతో 2019 జూన్‌లో కోర్టు దోషిగా పరిగణించింది. ఇక అందులో భాగంగా తాజాగా రనీర్‌కు జీవిత ఖైదు కాకుండా కేవలం 15 సంవత్సరాల జైలు శిక్ష సరిపోతుందని ఆయన తరుపున న్యాయ వాదులు వాదనలు వినిపించగా కోర్టు వాటిని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో రవీన్‌తో పాటు మరో 5 మంది నిందితులకు కోర్టు తాజాగా శిక్ష ఖరారు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: