ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ను కొంత మంది ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం జగన్ ను అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. వైసీపీ నేతలను టార్గెట్ చేసి అవినీతి ఆరోపణలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటి విషయంలో అధికార పార్టీ నేతలు చాలావరకు ఇబ్బంది పడుతూనే  ఉంటున్నారు. అయితే కొంతమంది నేతలు మాత్రం మాట్లాడే విషయంలో పెద్దగా ముందుకు రావడం లేదు.

తెలుగుదేశం పార్టీ ని విమర్శించడానికి చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేయడానికి కొంత మంది నేతలు ఆసక్తి చూపించడం లేదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని చాలామంది నేతలు సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో సీఎం జగన్ ఇప్పుడు మాత్రం సీరియస్ గానే ఉన్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడును విమర్శించే ప్రయత్నం చేయడం లేదని దీంతో వారికి నేరుగా నేను సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారట. వారిద్దరూ కూడా సీఎం జగన్ సన్నిహితంగానే ఉన్నారని సమాచారం.

మీడియా ముందుకు వచ్చి కొద్దిగా కూడా మాట్లాడే ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పుడు పార్టీ మంత్రులు కూడా వారికి చెబుతున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది నేతలు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడును విమర్శించే విషయంలో ముందుకు రాలేకపోతున్నారు. దీంతో వారందరినీ కూడా పిలిచి వార్నింగ్ ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారట. చంద్రబాబు నాయుడుని రాజధాని విషయంలో విమర్శించకుండా ఉండటంతో అక్కడి ప్రజల్లో కొన్ని వాస్తవాలు వెళ్లడం లేదు అని సీఎం జగన్ భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏ విధమైన పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది చూడాలి. మారకపోతే మాత్రం కష్టం అని కొంతమంది నేతలు బహిరంగంగానే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: