దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతాపార్టీ చాలా వరకు కూడా బలంగానే ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడు హిందుత్వ వాదం ఆధారంగానే బలపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కానీ ఆ పార్టీని ఎదుర్కోవడానికి విపక్షాలు కూడా ఇప్పుడే క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే విధంగా పనిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ఎదుర్కొనే విధంగా కొన్ని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే బిజెపి అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఎన్నికల ఉన్న రాష్ట్రాల్లో అధికార పార్టీలు కాస్త ఎక్కువగా కష్టపడుతున్నాయి. కేరళ పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బిజెపి చేస్తున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనితో ఆ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి గాను ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. బిజెపి ఎక్కడెక్కడ టార్గెట్ చేసిందో ఆయా రాష్ట్రాల్లో సోషల్ మీడియా లో జరిగే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

దీనివలన ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంటుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా హిందుత్వ వాదం విషయంలో ముస్లింలతో సహా ఇతర వర్గాలను అవమానకరంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విపక్షాలు భావిస్తున్నాయి. దీనితోనే వారిని ఎదుర్కోవడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక సోషల్ మీడియాకు సంబంధించి భారీగానే రాజకీయ పార్టీలు ఖర్చు చేస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఏ విధమైన పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతాయి ఏంటి అనేది చూడాలి. టిఆర్ఎస్ పార్టీ కూడా అప్రమత్తం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: