గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏమీ లేదు కానీ బీజేపీ గెలిస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవచ్చు. బీజేపీ ఇప్పుడు గ్రేట్ కాస్త ఎక్కువగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ ని ఎదుర్కోవడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేటీఆర్ ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అనే విషయం బిజెపి  నేతలకు కూడా స్పష్టంగానే అర్ధమవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక ప్రణాళికల ద్వారా తెలంగాణలో బలోపేతం అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో బీజేపీ అగ్రనాయకులను తీసుకురావాలని అంతేకాకుండా బీజేపి నియోజకవర్గ ఇన్చార్జిలను ఇంటింటికి ప్రచారం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని భావిస్తున్నారట.. మరి ఎవరు ప్రచారం చేస్తారు ఏంటి అనేది తెలియదు కానీ త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసే వారి జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయని టాక్. కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి కూడా కొంత మంది తో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.

తెలంగాణలో బలపడాలంటే ముందు హైదరాబాదులో భయపడాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో ఎంఐఎంను కూడా ఎదుర్కొనే నిలబడాల్సిన అవసరం ఉంది. దీనితోనే ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని నిలబడటం కష్టంగానే ఉంటుంది అనేది చెప్పాలి. అయినా సరే పరిస్థితులు మాత్రం తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ నేతలు ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇక సినీ నటులను కూడా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: