తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కాస్త హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి అధికార పార్టీని విమర్శించే విషయంలో కాస్త ఎక్కువగానే విమర్శలు చేస్తున్నారు. అయితే రాజకీయంగా  తెలంగాణలో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆయనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటుగా విమర్శలు చేస్తున్న సరే ఫలితాలు మాత్రం కాస్త భిన్నంగా ఉన్నాయి అనే విషయం చెప్పవచ్చు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలంగాణ లో సీఎం కేసీఆర్ చాలా బలంగా ఉన్నారు. ఆయనను ఎదుర్కోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కావడం లేదు. అయినా సరే కొంతమంది నేతలు మాత్రం రేవంత్ రెడ్డికి సహాయ సహకారాలు అందించే విషయంలో కాస్త వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు మంచి ఆఫర్లు ఇచ్చి తమ పార్టీలోకి తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ భారతీయ జనతా పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటుపై హామీ ఇచ్చారని టాక్.

ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే కేంద్రంలో ఇచ్చే పదవిపై కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆయనతో సమావేశం నిర్వహించి ఆలోచనలో ఉన్నారని భావిస్తున్నారు. త్వరలోనే రేవంత్ రెడ్డిని ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బీజేపీ లోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ బిజెపిని ప్రక్షాళన చేయాలని బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరి రేవంత్ రెడ్డి పదవి ఏంటి...? ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది త్వరలోనే ఒక స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: