తెలంగాణలో విజయశాంతి గురించి ఇప్పుడు మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఏ పార్టీలో ఉంటుంది అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్తారా లేదా అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు చూస్తే ఆమె బీజేపీలోకి వెళితే మాత్రం  ఆమెకు చాలా మంచి పదవి ఇచ్చే అవకాశం ఉంది అని చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అందుకు అనుగుణంగా పరిస్థితి కనపడటం లేదు అనే విషయం చెప్పవచ్చు. అయితే బీజేపీలోకి వెళితే మాత్రం ఆమెకు ఇచ్చే పదవి విషయంలో రాష్ట్ర పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఇప్పటికే చాలా మంది నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్న సరే బిజెపి కొందరికే పదవులు ఇచ్చింది. ఇతర పార్టీల నుంచి కొంత మందిని తీసుకొచ్చిన వారికి పదవులు ఇస్తే రాష్ట్ర పార్టీలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయని టిఆర్ఎస్ పార్టీకి ఇది అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని కొంతమంది నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆమె విషయంలో బీజేపీ అధిష్టానం ఆచితూచి వ్యవహరించాలని సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు విజయశాంతి విషయంలో మంత్రి కిషన్ రెడ్డి కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఆమెకు ఒక నియోజకవర్గం అప్పగించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆమెను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో ఆమె ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని చేసుకునే విధంగా అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు. గతంలో ఆమె ఇక్కడ ఎంపీగా చేసిన సంగతి తెలిసిందే. ఆమెకంటూ నియోజకవర్గంలో కొంత వరకు వర్గం కూడా ఉంది. దీనితో నియోజకవర్గంలో పరిస్థితులు కూడకలిసి వచ్చే అవకాశాలు ఉంటాయని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని నిన్న జరిగిన సమావేశంలో విజయశాంతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: