బీఎస్పీ రాజ్యసభ పార్టీ అభ్యర్థిగా రామ్‌ జీ గౌతమ్‌ ను ప్రతిపాదించిన తర్వాత 10 మంది బిఎస్‌పి ఎమ్మెల్యేల్లో ఐదుగురు తమ సంతకాలు నకిలీవని చెప్పి బుధవారం తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. నామినేషన్ పత్రాలపై తమ సంతకాలు నకిలీవని ఐదుగురు బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చినట్లు అసెంబ్లీ సచివాలయ వర్గాలు తెలిపాయి. గౌతమ్ వచ్చే నెల రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత, నాటకీయ పరిణామం చోటు చేసుకుంది.

వారు వేరే పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అస్లాం రైనీ, అస్లాం చౌదరి, ముజ్తాబా సిద్దిఖీ, హకీమ్ లాల్ బైంద్, హర్గోవింద్ భార్గవ అనే ఐదుగురు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. నవంబర్ 9 న జరిగే ఎన్నికలకు బుధవారం నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. రిటర్నింగ్ అధికారి నకిలీ సంతకాలపై ఫిర్యాదును పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని వర్గాలు తెలిపాయి. సోమవారం, మాయావతి పార్టీ తన జాతీయ సమన్వయకర్త మరియు బీహార్ ఇన్‌ చార్జ్ రామ్‌ జీ గౌతమ్‌ ను రాజ్యసభ ఎన్నికలకు నిలబెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఆయన అభ్యర్థిత్వానికి ఇతర బిజెపియేతర పార్టీలు మద్దతు ఇస్తాయని తాము ఊహించామని పార్టీ అధిష్టానం పేర్కొంది. బిజెపికి చెందిన ఎనిమిది మందితో సహా 11 మంది అభ్యర్థులు తమకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది బీఎస్పీ భావించింది అనే వార్తలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ నుంచి 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. యుపి అసెంబ్లీలో బిజెపికి ఉన్న అధిక బలం దృష్ట్యా, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సహా మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు అధికార పార్టీ నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న 10 రాజ్యసభ స్థానాల్లో, ముందు... మూడు బిజెపికి, నాలుగు సమాజ్ వాదీ పార్టీకి, రెండు బిఎస్పికి, ఒకరు కాంగ్రెస్ నుంచి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: