ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమారు...పేరుకు ఎలక్షన్ కమిషనర్ అయినా, ఓ రాజకీయ నాయకుడు లాగా ఆయన టీడీపీకి అనుకూలంగా ఉంటారని అధికార వైసీపీ నేతలు ఎప్పటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు నిమ్మగడ్డకు, అధికార వైసీపీకి ఏ మాత్రం పొసగడం లేదు. ఎప్పుడైతే నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని అడగకుండా  స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేశారో అప్పటి నుంచి, ఎస్‌ఈసిభ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో రాజకీయం మారిపోయింది. తమని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఎన్నికల వాయిదా వేయడం పట్ల అధికార వైసీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో తెలిసిందే.

ఆయన్ని పదవి నుంచి తప్పించాలని చూడటం, మళ్ళీ నిమ్మగడ్డ కోర్టుకు వెళ్ళి పదవి నిలబెట్టుకోవడం జరిగాయి. అయితే కొన్నిరోజులు వీరి మధ్య వివాదం పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ఇప్పుడు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెరపైకి రావడంతో పరిస్తితి మారింది. ప్రభుత్వం ఏమో ఎన్నికల నిర్వహణకు సిద్ధం లేదని తేలిపోయింది. కానీ నిమ్మగడ్డ మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే తాజాగా అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి వైసీపీ తప్పా, మిగిలిన పార్టీలు హాజరయ్యాయి. వారు ఎన్నికలు నిర్వహించాలని చెబుతూనే, మళ్ళీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత నోటిఫికేషన్ సమయంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అందుకే ఎక్కువ ఏకగ్రీవాలు అయ్యాయని, కాబట్టి మళ్ళీ ఫ్రెష్‌గా నోటిఫికేషన్ ఇవ్వాలని అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం ఎన్నికల నిర్వహణకు, రీ నోటిఫికేషన్‌కు సిద్ధంగా లేదు.

దీంతో నిమ్మగడ్డ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన కూడా డైరక్ట్‌గా రాజకీయం చేయడానికి సిద్ధమైపోయారనే వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించడం లేదన్న వైసీపీ ప్రకటనల్లో నిజం లేదని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొట్టిపారేశారు. అంటే ఆయన వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే నిమ్మగడ్డ, వైసీపీ ఏమి చేసినా వెనక్కి తగ్గేలా లేరని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: