కరోనా వైరస్ మహమ్మారిగా వ్యాపించి ఈ రోజు మొత్తం భూగోళాన్ని చుట్టుముట్టేసింది. కరోనా గురించి మొదట్లో యావత్తు ప్రపంచ సమాజం భయపడింది. ఒక విధంగా చెప్పాలంటే వణికిపోయింది. ఆ తరువాత కొంత పరిశోధన చేసిన నేపధ్యంలో కరోనా గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. కరోనా కూడా ఒక జ్వరం లాంటిదేనని కూడా అన్నారు. ఇలా వచ్చి అలా పోతుందని కూడా చెప్పుకొచ్చారు. కానీ నిజానికి కరోనా కొందరి విషయంలో అలా జరిగి ఉండొచ్చు అయితే  చాలా కేసుల్లో మాత్రం దారుణంగానే తన విశ్వరూపాన్ని చూపించింది అని కూడా ఇపుడు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

కరోనా నెగిటివ్ వచ్చినా కూడా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి. కరోనా వైరస్  కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే మనిషి శరీరంలో ఉంటుంది. ఆ తరువాత అది చచ్చిపోతుంది. కానీ ఈలోగా చేయాల్సిన విద్వంసం చేసి పారేస్తుంది. మనిషికి లోపల ఉపయోగపడే అనుకూల జన్యు కణాల  మీద తన  ప్రభావం చూపించి వాటినే ఆ మనిషికి  శత్రువులుగా చేస్తుంది. ఆ మీదట‌ అసలు కధ అవి మొదలుపెడతాయి. అపుడు కరోనా వైరస్ శరీరంలో లేకపోయినా కూడా మనిషిని ప్రమాదమే. కరోనా వైరస్  ఎపుడైతే చచ్చిపోతుందో అపుడు నెగిటివ్ వస్తుంది.

కానీ అక్కడ నుంచే కొత్త కధ స్టార్ట్ అవుతుంది.  ముఖ్యంగా దీర్ఘ కాల సమస్యలు ఉన్న వారే కరోనాకు చాలా చులకన. వారిని అసలు వదలదు, పీల్చి పిప్పిచేస్తుంది. వయసు మీద పడిన వారు, జబ్బులు ఉన్న వారు అయితే నమిలి మింగేస్తుంది. ఇక కరోనా విషయంలో మరికొన్ని చిత్రమైన కేసులను కూడా కనుగొంటున్నారు. కరోనా తగ్గి నెగిటివ్ వచ్చి ఇంటికి వెళ్లిపోతున్న వారికి మళ్ళీ అది తిరగబెడుతోంది. అయితే అప్పటికే నెగిటివ్ అని వస్తుంది. కాబట్టి అది కరోనా జబ్బు కాదనుకుంటారు. కానీ కరోనా లోపల తయారు చేసిన విషం అలా మెల్లగా ప్రభావం చూపించి చివరికి వారికి ఉన్న పాత జబ్బులను తిరగతోడుతోంది. మొత్తానికి అది వారిని కాటికి సాగనంపేవరకూ ఊరుకోవడంలేదు.

విశేషమేంటంటే వారంతా కరోనా నెగిటివ్ వచ్చి బయటపడ్డవారు కాబట్టి ఆ చావులన్నీ కూడా సాధారణ చావులుగానే జమ కడుతున్నారు. కానీ కరోనా వల్ల శరీరంలో ఉత్పన్నమైన ప్రతికూల పరిస్థితులు అలా దారితీసి వారిని మరణం వైపునకు నడిపిస్తున్నాయి. కానీ అలాంటి చావులను కరోనా లెక్కల్లో రాయకపోవడం వల్ల కరోనా కేసులలో మరణాలు, ప్రమాదాలు పెద్దగా లేవని అంతా అనుకుంటున్నారు. నిజానికి ఇలా సైలెంట్ గా సంభవించే మరణాలు దేశం మొత్తం చాలా అత్యధిక శాతమే ఉన్నాయని అంటున్నారు. అందువల్ల కరోనాను ఇప్పటికైనా చులకనగా చూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని
 పరిశోధకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: