సాధారణంగా తెలంగాణలో ధర్మపురి అరవింద్ దూకుడు ఉన్న నేత అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా సరే సూటిగా మాట్లాడతారు అని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న విమర్శలకు అధికార పార్టీ చాలా వరకు కూడా ఇబ్బందుల్లో పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఆయన సీఎం కేసీఆర్ ని అదేవిధంగా మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

నేడు జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్ ని అదేవిధంగా మంత్రి హరీష్ రావు కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ నోటికి పని చెప్పారు. దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆయనకు కాస్త ఘాటుగానే సమాధానం ఇవ్వాలని భావిస్తున్నారు. అరవింద్ ఇప్పటి వరకు పెద్దగా మాట్లాడిన సందర్భం అంటూ ఏదీ లేదు. కానీ ఆయన ఇప్పుడు మాత్రం కాస్త దూకుడుగా వెళుతున్నారు. దీనివల్ల టిఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఎక్కువగానే చికాకు పడుతున్నారు.

ఇదే విధానం కొనసాగితే మాత్రం అనవసరంగా భవిష్యత్తులో ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉంటుందని ఆయన ను కట్టడి చేయాలని భావిస్తున్నారు. దీంతో సిఎం కేసీఆర్ కూడా పార్టీ నేతలకు కొన్ని సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రి హరీష్ రావు కొంతమంది పార్టీ నేతలకు ఫోన్ చేసి ధర్మపురి అరవింద్ కి దీటుగా సమాధానం ఇవ్వాలని కాస్త గట్టిగానే సూచనలు చేశారు. ఇదే విధానం కొనసాగితే మాత్రం అనవసరంగా పార్టీ ప్రజలను ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని, ఆయనకు దీటుగా విమర్శలు చేయకపోతే మాత్రం ఇబ్బందులు ఉంటాయని మంత్రి కేటీఆర్ కూడా కొంతమంది నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి ధర్మపురి అరవింద్ విషయంలో భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తుంది టిఆర్ఎస్ పార్టీ అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: