తెలంగాణలో ఇప్పుడు  భారతీయ జనతా పార్టీ బలపడటం ఏమోగానీ అధికార పార్టీ ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ చేసే విమర్శలకు ఏకంగా మంత్రులు సహా సీఎం కేసీఆర్ కూడా కాస్త ఇబ్బందిగానే ఫీలవుతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా తెలంగాణలో ఆ పార్టీ ఎలాంటి అవకాశాలు లేకపోయినా ఆ పార్టీ మాత్రం అన్ని విధాలుగా తనకు పరిస్థితులను అనుగుణంగా మార్చుకునే విధంగా ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేస్తుంది.

అయితే ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఎక్కువగా కొన్ని వ్యాఖ్యలు  వినబడుతున్నాయి. తెలంగాణ బిజెపి... కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలను క్షేత్రస్థాయిలో టార్గెట్ చేసిందని దుబ్బాక ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత వారిని టార్గెట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. కొంతమంది నేతలను టిఆర్ఎస్ నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ తీవ్రంగా కష్టపడుతున్నారు అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు సహచరులు కొందరిని టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

దుబ్బాక నియోజక వర్గంలో విజయం సాధించిన లేకపోయినా సరే ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా లో ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అటు బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కాస్త ఎక్కువగానే ఫోకస్ చేశారు. ధర్మపురి అరవింద్ టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ గా చేసుకుని అదే విధంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శ దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ కాస్త ఎక్కువగానే ఇబ్బందులు పడుతున్నట్లు గా కనబడుతుంది. త్వరలోనే మరి కొందరు నేతలతో ఆయన చర్చలు కూడా జరిపే అవకాశాలు ఉన్నాయి అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: