చైనా తెంపరిది. నెరజాణ అని కూడా అంటారు అంతర్జాతీయ విశ్లేషకులు. తనకు కావాల్సిన దానికోసం అనుకూలంగా ఉంటూ సమయం చూసి చావు దెబ్బ కొట్టడానికి చైనా వెనకాడదు. ఆధునిక ప్రపంచంలో చైనా వంటి దురాక్రమదారుడు  వేరే ఉండరని కూడా అంతర్జాతీయ దౌత్య సమాజం నొక్కి మరీ  చెబుతుంది. చైనాకు సరిహద్దుల్లో దాదాపుగా రెండు పదుల దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు అన్నింటితోనూ చైనా కయ్యం పెట్టుకుంది. మరి తప్పు అంటే చైనాదేనని చెప్పాలి కదా. ఒక దేశం కాకపోతే మరో దేశమైనా చైనాకు నచ్చాలి కదా. నెయ్యం కుదరాలి కదా. అలా జరగలేదు అంటే ఆ నేరాలూ ఘోరాలు చైనావేనని అంతా అంటున్నారు.

ఇదిలా ఉంటే చైనా ఇపుడు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటోంది. సౌండ్ కూడా మారుతోంది. టోన్ డౌన్ చేస్తోంది. దీనికంతటికీ కారణం ఏంటి అంటే అమెరికా భారత్ ల మధ్యన తాజాగా జరిగిన చర్చలు. రక్షణ పరమైన అంగీకారాలు. భారత్ కి మేము అండగా ఉంటాము, తూర్పు లఢక్ ప్రాంతంలో భారత్ సరిహద్దుల వద్ద చైనా సృష్టిస్తున్న బీభత్సానికి మేము వ్యతిరేకమని కూడా అమెరికా తాజాగా ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పంపియో భారత్ కు గట్టి మద్దతు ప్రకటించారు.

దీని మీద చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ అందులో తమ భయం కనిపించకుండా గంభీరమైన పదాలను  జాగ్రత్తగా  వాడింది. భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ఆ రెండు దేశాలు కలసి పరిష్కరించుకుంటాయి. మధ్యలో అమెరికా పెత్తనమేంటి అంటూ ఆగ్రహించింది. ఇక అమెరికా ఈ ముసుగులో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చేరి  ప్రపంచ పెత్తనానికి రెడీ అవుతోంది అని ఆక్షేపించింది. అమెరికా పెడ ధోరణులను తాము గట్టిగా ఖండిస్తున్నామని కూడా చెప్పుకొచ్చింది.

ఇక అమెరికా మధ్యలో దూరనక్కరలేదు అంటూ ఇండైరెక్ట్ గా భారత్ కూడా అమెరికా మధ్యవర్తిత్వానికి ఒప్పుకోరాదంటూ చెప్పుకొచ్చింది. సరే ఇవన్నీ బాగానే ఉన్న కాశ్మీర్ పాకిస్థాన్ ఇండియాల మధ్య ద్వైపాక్షిక సమస్య అని నాడు పదే పదే భారత్ చెబితే చైనా ఊరుకుందా. మధ్యలో పాక్ పక్షం వచ్చి దూరడానికి ఎన్నోసార్లు చూసిందిగా. ఇక ఇపుడు కాశ్మీర్ లో 371 ఆర్టికల్ ని రద్దు చేసినపుడు కూడా భారత అంతర్గత విషయాల్లో దూరి మరీ విమర్శలు చేస్తోంది. అటువంటి చైనాకు అమెరికాను దూరవద్దు అని చెప్పే నైతిక  హక్కు ఉందా అన్నది ప్రశ్న. ఇవన్నీ కాదు కానీ అమెరికా భారత్ దోస్తీ చూసి భయం పట్టుకుని చమటలు కక్కుతున్న చైనా ఇలాంటి ప్రకటనలే చేస్తుందని అని అంతా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: