కరోనా వైరస్ అనేక  సామాన్య మానవులకు సోకింది.  మరియు ఎంతో మంది ప్రాణాలను తన వెంట ఇప్పుడు కరోనా వైరస్ దారి మార్చుకుంది . సామాన్య మానవులకు బదులు   రాజకీయ నాయకులకు మరియు సినీ హీరోల వెంట పడటం ప్రారంభమైంది.అందులో భాగంగా టాలీవుడ్  హీరోల దగ్గర  నుండి ఢిల్లీ రాజకీయ ప్రముఖుల దాకా కరోనా లక్షణాలు  బయట పడుతున్నాయి .

తాజాగా కేంద్ర మంత్రి అయినా స్మృతి  ఇరానీ కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది .  ఆమె ఈ విషయాన్నీ తన ట్విటర్  ద్వారా తెలిపారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే స్మృతి ఇరానీ తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని  కాస్త వినూత్నంగా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ త్వరగా పరీక్షలు చేయించుకోవాలని స్మృతి ఇరానీ  సూచించారు. మాములుగా కరోనా పాజిటివ్ గా ఎవరికైనా నిర్దారణ అయినట్టు విషయం తెలుస్తుందో అప్పుడు వాళ్ళు చాలా భయబడిపోతారు . టెన్షన్ కి లోనవుతారు . కానీ స్మృతి ఇరాని మాత్రం తనకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ విషయాన్నీ సాదరంగా చెప్పడం చూస్తే ఆశ్చర్యం  కలుగుతుంది . ఇలా చెబుతూనే  నన్ను కలిసిన వారు సాధ్యమైనంత త్వరగా పరీక్షలు చేయించుకొండి అని స్మృతి ఇరానీ కోరారు .

కరోనా వైరస్ ఢిల్లీ మంత్రుల్ని కూడా పలుకరించింది . ఇప్పటి వరకు  కరోనా బారినపడిన వారిలో హోం మంత్రి అమిత్ షా, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,తాజాగా స్మృతి ఇరానీ కూడా చేరారు .మరోవైపు.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం  80 లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43  వేల కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా.. రికవరీ రేటు పెరుగుతుండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: