జమ్మూ కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ లో భారత దేశానికి చెందిన ఏ పౌరుడైనా అక్కడ భూములను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది ప్రభుత్వం.

జమ్ముకశ్మీర్, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పుడు ఎవరైనా భూమి కొనుగోలు చేయవచ్చు. ఇందుకు మార్గం సుగమం చేస్తూ భూ చట్టాలను కేంద్రం నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం భారతదేశానికి చెందిన ఏ పౌరుడైనా జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేయవచ్చు.

జమ్ముూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ మూడవ ఉత్తర్వు, 2020 అనే పేరుతో ఆ ప్రకారం ఉత్తర్వులను విడుదల చేసింది భారత ప్రభుత్వం. ఈ ఉత్తర్వు తక్షణమే అమల్లోకి వస్తుందని, జనరల్ క్లాజ్ యాక్ట్, 1897 ఆర్డకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా ఆ ఉత్తర్వులపై స్పందించారు. "జమ్ముకశ్మీర్‌ ఇప్పుడు అమ్మకానికి ఉంది" అని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. ఈ ఉత్తర్వుతో పేద చిన్న భూ యజమానులు బాధపడటం ఖాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 370 ను రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ రాష్ట్రం 'జమ్ముకశ్మీర్', 'లడఖ్' అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడ్డాయ్. అంతకుముందు అంటే.. 2020 సెప్టెంబర్‌లో ఉన్న జమ్ముకశ్మీర్ పరిపాలన, 2020 గ్రాంట్ ఆఫ్ డొమిసిల్ సర్టిఫికేట్ నిబంధనలు రద్ధయ్యాయ్.

మొత్తానికి కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ పై మరో నిర్ణయం తీసుకుంది. మన దేశానికి చెందిన ఏ పౌరుడైనా అక్కడ భూములు కొనేలా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తీసుుకున్న నిర్ణయంపై ఒమర్ అబ్ధుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మూకశ్మీర్ ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందంటూ ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో విమర్శలు చేయడం ఇపుడు చర్చనీయాంశమైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: