చంద్రబాబు కి ఆంధ్రప్రదేశ్ లో ఎలా రాజకీయం చేయాలో అర్థం కావట్లేదు..చీటికీ మారికి జగన్ ను విమర్శించి ప్రజల్లో వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నాడు.. తెలుగు దేశం నేతలు జగన్ ను గెలకొద్దు ని ఎంత చెప్తున్నా చంద్రబాబు వినకుండా జగన్ ను హీరో చేస్తున్నాడు.. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి కారణం కూడా మితిమీరిన విమర్శలే అని వారి సర్వే లో వెల్లడైంది కూడా.. అయినా వినకుండా అలానే విమర్శిస్తున్నారు. ఓ వైపు ప్రజలంతా కలిసి ఆయన్ని దారుణంగా ఓడించారు.. మరోవైపు అమరావతి లో ని ప్రజలను మోసం చేసి రాజధాని ని అభివృద్ధి చేయకుండా అక్కడినుంచి తరలించేలా చేశారు.

కరోనా సమయంలో ప్రజలను ఆదుకునే తెలుగుదేశం ఒక్కరు కూడా లేకుండా పోయారు. చంద్రబాబు అయితే హైదరాబాద్ లోని తన నివాసం నుండి బయటకు రాలేదు.. లోకేష్ సంగతి చెప్పనవసరం లేదు.. మామూలుగానే బయటకి రాడు.. ఇక కరోనా సమయంలో అయితే గుమ్మం నుండి బయటకు రాలేదు.. అంతా సద్దుమణిగాక చంద్రబాబు అండ్ కో బయటకి వచ్చి పార్టీ కార్యకలాపాలు జోరుగా మొదలుపెడుతున్నారు.. అయితే కష్ట కాలంలో రాకుండా ఇప్పుడొచ్చి ఏం లాభం అని ఆంధ్ర లోని టీడీపీ నేతలే చెప్తున్నారు..

ఇక అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలను ప్రధానంగా పదేపదే చెబుతూ జనాన్ని ఆకట్టుకునేందుకు చంద్రబాబు, ఆయన పార్టీ బృందాలు తీవ్రంగా శ్రమించారు. అయితే ఆ విషయాలను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాలు తేల్చేసాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అవే విషయలను, అది కూడా తానేదో గొప్పగా చేసేసాను అన్నరీతిలో చెప్పుకునేందుకు చంద్రబాబు ఆసక్తిచూపిస్తుండడాన్ని ఆక్షేపిస్తున్నారు. అది జరిగిపోయిన ఎపిసోడ్‌అని ఫ్లాష్‌బ్యాక్‌లు వేసి జనానికి గుర్తుచేసేంత గొప్పదనం లేదని తేల్చేస్తున్నారు. పైగా గతాన్ని తవ్వి తమకుతాముగానే బైటకు తీస్తే అందులోని లోపాలు తమ మెడకే చుట్టుకుంటాయని తెలుగుతమ్ముళ్ళు తలలు బాదుకుంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఇదే ధోరణిని కొనసాగిస్తుండడంతో వారంతా అమోయ పరిస్థితుల్లోకి జారుకుంటున్నారంటున్నారు.ఇదే రీతిలో విమర్శలతోనే పుణ్యకాలం కాస్తా పూర్తిచేసేసుకుంటే పార్టీ పరిస్థితి ఏంటన్న భయంతో తెలుగుతమ్ముళ్ళకు రాన్రాను ఎక్కువైపోతోందట..

మరింత సమాచారం తెలుసుకోండి: