కర్ణాటకలోనయా దందా వెలుగులోకి వచ్చింది ... కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. ఆపై ఫేక్ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు. పలు ఆస్పత్రుల యాజమాన్యం లీలలు బెంగళూరు సిటీలో సంచలనంగా మారాయి.

అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న కొన్ని ఆసుపత్రులకు ఇప్పుడు కరోనా పరీక్షలు వరంలా మారాయి. కర్నాటకలోని బెంగళూరు నగరంలో పలు ఆసుపత్రులు కరోనా టెస్టుల పేరుతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నవైనం కలకలం రేపుతోంది. ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే.. కరోనా టెస్టులు తప్పనిసరి. ఈ నిబంధననే కొన్ని ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ల అక్రమ దందాకు తెరలేపాయి.

 కోవిడ్ టెస్ట్ లో... నెగిటివ్ వ‌స్తుందా అని భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు.. క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ దాన్ని లేకుండా చేయ‌గ‌లమని భరోసా ఇచ్చేస్తున్నాయి కొన్ని ఆసుపత్రులు.   మీకు ఎలాంటి చింత అవ‌స‌రం లేకుండా క‌రోనా నెగిటివ్ స‌ర్టిఫికెట్ ఇస్తాం అంటూ బంప‌ర్‌ ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి.   ఇందుకోసం  2 వేల 500 రూపాయ‌లు ఫిక్స్ చేసి మరీ ఫేక్ కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి బెంగళూరు సిటీలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్.

క్వారంటైన్ కు భయపడి కొందరు ... ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లు మరికొందరు.. ఇలా ఎవరికి వాళ్లు అవసరమైన రీతిలో సర్టిఫికేట్లు దక్కించుకుంటున్నారు. బెంగళూరు సిటీలో ఇప్పటికే భారీగా తప్పుడు అడ్రస్ , ఫేక్ ఫోన్ నెంబర్లతో కూడా సర్టిఫికేట్లు జారీ చేశారని సమాచారం. మరి ఈ సర్టిఫికేట్లు పట్టుకుని విచ్చలవిడిగా సంచరించి ఇతరులకు వైరస్ అంటిస్తే పరిస్ధితులు  ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది.   నకిలీ రిపోర్టులు ఇచ్చి మోసగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజామాన్యంపై  కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమ దందా మూడు పూవులు ఆరు కాయల్లా వర్ధిల్లుతోంది. దీనిపై అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: