జనసేన బిజెపి పార్టీలు కలిసి ఏపీలో అధికారం దక్కించుకునేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. పవన్ దగ్గర ప్రజాకర్షణ ఉండడం, తమ దగ్గర రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఉండడం, ఇలా ఎన్నో అంశాలు కలిసి వస్తాయని రెండు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. అందుకే ఈ రెండు పార్టీల పొత్తు పై అందరిలోనూ అనుమానాలు ఉన్నా, ఎన్నికల వరకు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా, ఏపీ బీజేపీ లో పెద్ద చేరికలు లేక పోవడానికి కారణాలు ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు టిడిపిలో ఇమడలేక పోతున్నారు వైసీపీ వైపు వెళ్తుండగా మరికొంతమందికి వైసీపీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లేక పోవడంతో వేచి చూస్తున్నారు. 



కానీ అటువంటి నాయకులైనా, బిజెపిలో చేరేందుకు ఇష్టపడుతున్నారా అంటే అదీ లేదు. ఎవరికి వారే తప్పించుకునే ధోరణిలో  బిజెపి కి దూరంగా ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు తర్వాత, వైసిపి ప్రభుత్వం ఏర్పడడంతో, తమకు రాజకీయంగా వేధింపులు , ఆర్థిక మూలాలపై జగన్ ఎక్కడ దెబ్బ కొడతాడో అనే భయం ఉండడంతో, చాలామంది టిడిపిలో ని నాయకులే బిజెపి బాట పట్టారు. అటువంటి వాళ్ళలో సుజనా చౌదరి, సీఎం రమేష్, టి.జి.వెంకటేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వరదాపురం సూరి కిషోర్ బాబు చాలా మంది ఉన్నారు. వీరంతా బీజేపీలో చేరినా, బిజెపికి వారి వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. 



కేవలం వారు బిజెపిని ఒక షెల్టర్ జోన్ గా మాత్రమే ఉపయోగించుకుంటూ, రాజకీయం నడిపిస్తున్నారనే విషయం కాస్త ఆలస్యంగా అయినా, బిజెపి గుర్తించింది. అయితే జనసేన అధినేత పవన్ చరిష్మా ను ఎవరు నమ్మలేక పోవడంతో,  అటు జనసేన లోకి కానీ, ఇటు బిజెపిలోకి కానీ, నాయకులు ఎవరు వెళ్లేందుకు ఇష్టపడడంలేదు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళినా, అధికారం చేజిక్కించుకోవడం అసాధ్యమనే అభిప్రాయం మెజారిటీ నాయకుల్లో ఉండటంతోనే, తమ రాజకీయ భవిష్యత్తు ఇక్కడితో ముగింపు పలకకుండా ఉండాలి అంటే, జనసేన, బిజెపి పార్టీలకు దూరంగా ఉండటమే మంచిదని నా అభిప్రాయం చదువు నాయకుల్లో కనిపిస్తున్నట్టుగా అర్థం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: