తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. అంతే కాకుండా, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే చాలా కాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.తన స్థాయికి తగ్గట్టుగా పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆమె ఉంటూ రావడమే కాకుండా బిజెపి వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్న తరుణంలో విజయశాంతి పార్టీ మారితే ఆ ప్రభావం ఎన్నికలపై తప్పనిసరిగా పడుతుందని, పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు.


ఇప్పటికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పార్టీ మారే విషయమై సుదీర్ఘంగా చర్చించడం , కాంగ్రెస్ లో మరింత ఆందోళన పెంచుతోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె ఆ పార్టీని వీడి బయటకు వెళ్లకుండా కాంగ్రెస్ మంతనాలు చేస్తోంది. దుబ్బాక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్న నేపథ్యంలో స్పష్టం గా ఆ ప్రభావం కనిపిస్తుందని ఆందోళనతో కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ రంగంలోకి దిగి , విజయశాంతి తో భేటీ అయి పార తలెత్తే పరిణామాలను పార్టీకి జరిగే నష్టాన్ని గురించి వివరించినట్టు తెలుస్తోంది. అలాగే రానున్న రోజుల్లో పార్టీ తరుపున మరింత ప్రాధాన్యం ఇస్తామంటూ, ఓ ప్రతిపాదనను ఆమె ముందు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ లోకి వెళ్లాలని డిసైడ్ అయిపోయిన ఆమె ఆయన మాటలు సైతం తోసిపుచ్చి నట్లు తెలుస్తోంది.


 అయితే అకస్మాత్తుగా కాంగ్రెస్ ను వీడి బీజేపీ లోకి వెళ్ళాలి అనుకోవడం వెనుక కారణాలేమిటి అనేది ఇప్పటికీ కాంగ్రెస్ నేతలకు అంతు పట్టడం లేదు. ఇప్పటికి విజయశాంతి,  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో భేటీ కావడం తో ఆయన విజయశాంతి ఏ హామీ ఇచ్చారు ? అసలు ఆ హామీతో ఆమె బిజెపి వైపు వెళ్తున్నారా ? ఇలా ఎన్నో అంశాలను ఆరా తీసే పనులలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆమెను బిజెపి వైపు వెళ్లకుండా, చూసే పనిలో కాంగ్రెస్ అన్ని  రకాలుగాను ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: