తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికతో ఒక్కసారిగా అందరూ రాజకీయ నాయకులు యాక్టీవ్ అయ్యారు. బరిలో చాలా పార్టీలు ఉన్నా...అసలైన పోటీ మాత్రం అధికార పార్టీ తెరాస కు మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి మాత్రమే. ఈ ఎన్నికలో గెలుపును కోసం ఇరుపార్టీలు సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో తమ జోరును చూపిస్తున్న తెరాస, ఎన్నికలో గెలిచేది తామే అంటూ డప్పు కొట్టుకుంటోంది. మరోవైపు ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో బీజేపీ పార్టీ అడ్డమైన దారులు తొక్కుతోంది. దానికి నిదర్శనమే మొన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో దొరికిన లక్షల డబ్బు. అయితే ఇప్పుడు బీజేపీ సరికొత్త అస్త్రంతో ప్రజలను బుట్టలో పడేయడానికి సిద్ధమైపోయింది. అదేమిటో కింద ఇచ్చిన ఏపీ హెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందామా...

బీజేపీ వారు తెలంగాణ ప్రజల్లో మాకు ఆదరణ ఉందని నిరూపించుకోవడానికి , విద్యుత్తు చట్టాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదిస్తున్నారని, దుబ్బాకలో వచ్చిన ఓట్లే అందుకు నిదర్శనమని వాదించాలన్నది వారి ఎత్తుగడ. ఎన్నడూ లేనట్టు ఓట్ల కోసం కోట్లు గుమ్మరిస్తున్నది అందుకే. మోసకారి మాటలు మోస్తున్నదీ అందుకే. కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌పై నీలాపనిందలు వేస్తున్నది. అర్ధంలేని ప్రచారంతో బీజేపీ అనుకూల మీడియా వారు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ఒకవేళ ఈ బిల్లుకు తెలంగాణ ప్రజలు విద్యుత్ బిల్లుకు మద్దతు పలికితే....ఇక మన చేతిలో ఏమీ ఉండదు.. ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేరు. ఇప్పుడు అమలులో వున్న కరెంటు సబ్సిడీ అంతకంటే సాధ్యం కాదు. యధావిధిగా బిల్లు కలెక్ట్ చేయడానికి అధికారులు వస్తారు....ఒకవేళ కట్టకపోతే మీటర్ తీసుకెళ్ళిపోతారు.  

మనకు కరెంటు కావాలంటే ఢిల్లీని అడుక్కోవాలి. ఈఆర్‌సీ (విద్యుత్తు నియంత్రణ మండలి) పోయి పీఆర్‌సీ (ప్రైవేటు నియంత్రణ మండలి) వస్తుంది. ఇవన్నీ నూటికి నూరుశాతం బిల్లులో ఉన్నయి. అంతెందుకు... కాళేశ్వరం నీళ్లు  మన పొలం పక్క కాల్వలో పారుతున్నా... కరెంటు మోటరు పెట్టి తోడుకోలేం.. వాడుకోలేం! విద్యుత్తు చట్టాలకు తెలంగాణ ఆమోదం ఉందని బీజేపీ చెప్పుకొనేందుకు ఒక పాచిక దుబ్బాక ఎన్నిక. కాబట్టి ప్రజలంతా ఆలోచించి మీకు ఏది ఉపయోగంగా ఉంటుందో దానికి మీ ఓటు వేస్తారని కోరుకుంటున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: