ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన విధివిధానాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటోంది. ప్రజల శ్రేయస్సే పరమావధిగా జగన్ పాలన సాగుతుండడంతో ప్రజలంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే టిటిడి పాలకమండలిలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగానే టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవిని ఎవరూ ఉహించని విధంగా సినీ నటుడు పృథ్విరాజ్ కు కేటాయించారు. ఈయన ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొని జగన్ తరపున తన వాణిని ప్రజలకు వినిపించారు. యన కష్టానికి ప్రతిఫలంగా ఈ పదవి దక్కడంతో తన సంతోషాన్ని ఎన్నో సార్లు  మీడియా వారితో పంచుకున్నారు.

అయితే అయన పాలనా సమయంలో కొన్ని అనుకోని వివాదాలతో తోటి పాలక సభ్యులే ఆయనపై కక్ష్య గట్టి మహిళా ఉద్యోగిపై అనుచితంగా ప్రవర్తించారన్న కారణంగా స్వయంగా ఆయనే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి ఖాళీగా వున్న ఈ పదవిని రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే వెంకటగిరి రాజకుటుంబీకుడు సాయికృష్ణ యాచేంద్రకు కట్టబెట్టారు. కొత్త చైర్మన్ గా నియమితులైన నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వీబీ సాయికృష్ణ యాచేంద్ర వచ్చే రెండు సంవత్సరాలపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో దివంగత రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు ప్రోద్బలం వలన రాజకీయ ఆరంగేట్రం చేసిన సాయికృష్ణ యాచేంద్ర. మొదటిసారిగా 1985 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వెంకటగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఈయన టీడీపీని వీడి వైసీపీలోకి జంప్ అయ్యారు. తరువాత మెల్ల మెల్లగా జగన్ కి అనుకూలంగా వ్యవహరిస్తూ తన మనసులో చోటు సంపాదించుకున్నాడు. జగన్ తనపై ఉన్న నమ్మకంతోనే ఇప్పుడు ఈ పదవిని ఇచ్చాడు. వివాదాలతో వున్న టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ పాలనను ఏవిధముగా సాగిస్తారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: