బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో ప్రస్తుతం బిజెపి ఎంతో వ్యూహాత్మకం గా ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో హామీలను కూడా కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే బిజెపి ఇచ్చిన ఒక హామీ బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపిస్తే  బీహార్ ప్రజలందరికీ కరోనా  వ్యాక్సిన్  ఉచితంగా అందిస్తాము అంటూ  బీజేపీ అభ్యర్థులు అందరూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాకముందే ప్రజలకు వ్యాక్సిన్  ఎలా ఇస్తారు అంటూ ప్రతిపక్షపార్టీలు ప్రశ్నిస్తున్నాయి.



 అంతేకాకుండా.. కేవలం బీహార్ ప్రజలకు మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్  అందిస్తామని బీజేపీ హామీ ఇస్తోందని.. అయితే మిగతా రాష్ట్రాలూ ఏమైనా  పాకిస్థాన్ లో ఉన్నాయా అంటూ మరికొన్ని పార్టీలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ఇచ్చిన ఉచిత వ్యాక్సిన్ హామీ బిజెపికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇప్పటికి కూడా తీరు మార్చుకోకుండా బిజెపి మళ్లీ అదే హామీ ఇచ్చింది.  మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు గాను ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీని మెజారిటీతో గెలిపిస్తే ఉచితంగా వ్యాక్సిన్  అందిస్తాము అంటూ మళ్ళీ హామీ ఇచ్చింది బిజెపి.  అంతేకాకుండా కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలను పునరుద్ధరిస్తాము  అంటూ చెప్పుకొచ్చింది.  అందుబాటులోకి రాని వ్యాక్సిన్.. ప్రజలకు ఉచితంగా ఇస్తానంటూ మభ్యపెట్టి ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తుంది.


ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఉచిత వ్యాక్సిన్ హామీ పై  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా  బీజేపీ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత వ్యాక్సిన్ హామీ ప్రకటిస్తోంది. అంతే కాకుండా మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల కోసం ఎంతో వ్యూహాత్మకంగా ప్రచారం చేపడుతుంది బిజెపి. ముమ్మర ప్రచారం చేపడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: