ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడటానికి తీవ్రస్థాయిలో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని ఆ పార్టీ నేతలు మాత్రం కూడా నమ్మే అవకాశాలు కనపడటం లేదు. ఇప్పటికే నలుగురు ఎంపీలు తెలుగుదేశంని వీడారు. అదేవిధంగా నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరికొంతమంది నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి మరికొంతమంది నేతలు బయటకు రావడం ఖాయం అని వినపడుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఎమ్మెల్సీ కూడా పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వీరందరూ కూడా వైసీపీ లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఇప్పటికే ఇద్దరు మంత్రులతో చర్చలు జరుపుతున్నారని  రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇది ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా దీనిపై మాత్రం త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా బలమైన నేతలు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వీరందరినీ కూడా ఆపడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా కష్టపడుతున్నా సరే ఫలితం మాత్రం ఉండటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి. అయితే కొంతమందికి పదవుల హామీలు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ మారాలని భావించగా వారికి బలమైన పదవులు ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారట. దీనితోనే వారు కొంతకాలంగా పార్టీ మారకుండా ఉన్నారు అని అయితే ఇటీవల ప్రకటించిన పదవులలో వారికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: