ప్రస్తుతం దేశం లో రోజు రోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలందరూ ఆందోళన లో మునిగి పోతున్నారు. ప్రస్తుతం దేశ ప్రజలూ  కరోనా  వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయికళ్ళ తో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే భారత్ లో పలు రకాల సంస్థలు కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసి ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటు లోకి రానుంది అని వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న పలు సంస్థలు చెబుతున్నాయి. అయితే వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చిన తర్వాత ముందుగా ఎవరికి ఇస్తారు అనేదాని పై ప్రస్తుతం ఆసక్తికర చర్చ మొదలైంది.



 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పోరాటం లో కీలకపాత్ర పోషిస్తున్న ఆరోగ్య కార్యకర్తల కు పారిశుద్ధ్య కార్మికుల కు పోలీసుల కు మొదటగా వ్యాక్సిన్  అందిస్తారని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యం లో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చిన తర్వాత ముందుగా ఎవరికి అందించాలి అనే దానిపై సీరమ్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వ్యాక్సిన్  అందించేందుకు కసరత్తు చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చింది సీరమ్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.




 డిసెంబర్ నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అంటూ తెలిపింది సీరమ్  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఎమర్జెన్సీ అవసరం ఉన్నవారికి కూడా ముందుగా ఈ వ్యాక్సిన్  అందిస్తాము అంటూ తెలిపారు. ఇక బ్రిటన్ లో నవంబర్లో వ్యాక్సిన్ అందుబాటు లోకి తీసుకురావాలని ఆక్స్ఫర్డ్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం ప్రస్తుత ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది ఆక్స్ఫర్డ్. కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ కీ  తొలిదశ  వ్యాక్సిన్  ఇచ్చేందుకు ఆక్స్ఫర్డ్ నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: