ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన జలవనరుల శాఖ మంత్రి తో భేటీ అయ్యే అవకాశాలు ఉండవచ్చని గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో సీఎం జగన్ వస్తే ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంకు అన్ని విషయాల్లో కూడా సీఎం జగన్ మద్దతు ఇస్తున్న సరే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రమే ఈ విధంగా వ్యవహరించడంతో సీఎం కాస్త ఇబ్బంది పడుతూ  ఉన్నారు.

రాజ్యసభలో  ఏ పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రాని సమయంలో సీఎం జగన్ మద్దతు ఇచ్చారు. అయినా సరే బీజేపీ నేతలు మాత్రం విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నారు అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. నేపథ్యంలోనే జగన్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లి పోలవరం విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీసే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్ర ప్రదేశ్ జీవనాడి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేది చూడాలి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం వద్ద అసలే మాత్రం కూడా నిధులు లేవు. అయినా సరే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారు కానీ దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇచ్చే విషయంలో మాత్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. కాబట్టి జగన్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా సీరియస్ గానే భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: