స్థానిక ఎన్నికలకు ఏపీ రెడీ అయిపోవాల్సిందేనా. ఎన్నికల నగరా రాష్ట్రంలో మోగాల్సిందేనా అంటే వేగంగా మారుతున్న పరిణామాలు అదే నిజం అంటున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నవంబర్ లో  జరిపించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ చేసిపెట్టుకున్నారు.

ముందుగా ఆయన ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని హై కోర్టుకు వెళ్ళడం, ఆ తరువాత రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం ఇందులో భాగమేనని అంటున్నారు. అంటే ఎన్నికల కోసం ముందస్తు కార్యక్రమాలుగానే వీటిని భావించాలి. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన అఖిల పక్ష భేటీలో అన్ని పార్టీలు లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించమని చెప్పాయి.

ఆ తరువాత మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ కూడా రాజకీయ పార్టీల అభిప్రాయాలను గౌరవిస్తామని చెప్పారు. ఇక ఏపీలో అధికార వైసీపీ ఎన్నికలు వద్దు అంటోంది. ఓ వైపు కరోనా ఉందని, రోజుకు మూడు వేల కేసులు నమోదు అవుతున్నాయని కూడా చెబుతోంది. కానీ ఎన్నికల సంఘం ఎన్నికల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి నిమ్మగడ్డ డెసిషన్ ఫైనల్ అని భావించాలి.

మరో వైపు  నవంబర్ లో  ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మరి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో తెలియదు కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదల మీద ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించకపోతే కేంద్ర బలగాలను తెచ్చి అయినా ఎన్నికలు జరిపించవచ్చు అని వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామ క్రిష్ణం రాజు సూచిస్తున్నారు. ప్రతిపక్షాలు గతంలో అదే డిమాండ్ చేశాయి. మరి ఎన్నికలు వద్దు అని పట్టుబట్టి కూర్చుంటే వైసీపీకి మరిన్ని కొత్త తలనొప్పులు కూడా వచ్చేలా ఉన్నాయని అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: