ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు కష్టపడి పండించిన పంటను అమ్మే క్రమంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా చూడాలని  అధికారులను ఆదేశించారు. అలానే ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరలుంటే ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పారు.  వారికి  తక్కువ ధరలకు పంటల కొనుగోళ్లు జరక్కూడదని, కనీస ధర రావాలని తగినన్ని ఏర్పాట్లు చేసారు జగన్.  ఇది ఇలా ఉండగా  అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ ప్రాజెక్ట్ , ఈ-మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ తో పాటు సీఎం యాప్‌ గురించి కూడా బుధవారం తన క్యాంపు కార్యాలయం లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే  వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి, వేరు శనగ, పత్తి లాంటి పంటలను అమ్ముకోవడం లో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని చెప్పడం జరిగింది. అలానే  మద్దతు ధర, కొనుగోళ్ల పై వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం లో ప్రతి రోజూ సమీక్ష చేయాలని ఆదేశించారు. ఇది ఇలా ఉండగా కొనుగోళ్లకు సంబంధించి రైతులకు 10 రోజుల్లోగా పేమెంట్‌ అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పడం జరిగింది.  ఖరీఫ్‌లో 1,09,24,524 మెట్రిక్‌ టన్నుల పంటలు వస్తాయని అంచనాగా ఉందని, 5,812 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎం కు వివరించారు.

 అలానే ధాన్యం అమ్మిన పది రోజుల్లోపు రైతులకు పేమెంట్‌ అందేలా చూడాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయ్యర్లు, రైతుల మధ్య పేమెంట్ల చెల్లింపు సక్రమంగా ఉండేలా పటిష్ట విధానం ఉండాలన్నారు. బయ్యర్‌ ఆర్డర్‌ చేయగానే 3 - 4 రోజుల్లో పంట డెలివరీ అయ్యేలా చూడాలి. అలానే  పంటను అత్యంత నాణ్యమైన విధానాల్లో ప్రాసెసింగ్‌ చేసి, క్వాలిటీ ప్రాడక్టు ఇవ్వడంపై దృష్టి ఉంచాలన్నారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధి, మహిళా ఆర్థికాభివృద్ధి కోసం ఉద్దేశించిన అమూల్ ‌తో అవగాహన ఒప్పందం అమలు గురించి ఆయన మాట్లాడడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: