తెలంగాణ రాజకీయాల్లో కొన్ని కొన్ని పరిణామాలు ఈ మధ్యకాలంలో ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా మంత్రి హరీష్ రావు ని టార్గెట్ చేస్తూ బిజెపి నేతలు చేస్తున్న విమర్శలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని కూడా ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తాజాగా ఆయనను ఉద్దేశించి నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మాత్రం మంత్రి పదవి పోయే అవకాశం ఉందని అందుకే హరీష్ రావు కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు.

ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియక పోయినా మంత్రి హరీష్ రావు మాత్రం ఉప ఎన్నికల్లో చాలా కష్టపడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం హరీష్ రావు ప్రాధాన్యత తగ్గే అవకాశాలు ఉండవచ్చు అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి హరీష్ రావు ఒక నియోజకవర్గంలో బాధ్యతలు చేపడితే ఆ నియోజకవర్గంలో కచ్చితంగా పార్టీ విజయం సాధిస్తుంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల విషయంలో కూడా ఆయన చాలా వరకు కూడా కష్టపడ్డారు.

దీనితోనే పార్టీ విజయం సాధించింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆయనకు అప్పగించింది కీలక బాధ్యతలు కావడంతో ఆయన విషయంలో చాలా చర్చలు ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం అనేది పార్టీ కంటే కూడా మంత్రి హరీష్ రావు కే చాలా అవసరం. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావు ఇమేజ్ దెబ్బ తినే అవకాశాలు కూడా ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనితోనే హరీష్ రావు కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. అటు బిజెపి ఆయనను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: