కరోనా మళ్ళీ మొదలయ్యిందా ? మళ్ళీ రాబోతోందా .. వైద్య వర్గాలు సెకండ్ వేవ్ తప్పకుండ వస్తుందని ధీమాగా  చెబుతున్నాయి .. చైనా వుహాన్ నుండి వచ్చిన ఈ కరోనా పెద్ద అలజడిని  సృష్టించింది . ప్రజలను ,దేశ ఆర్థిక వ్యవస్థలను అతకకుతకాలం చేసింది . ఇప్పటికి కొన్ని దేశాలు కరోనా ఇచ్చిన షాక్ లో నుండి బయట పడేలేకపోతున్నారు . ఇప్పటికి కొన్ని దేశాల యొక్క పరిస్థితి అంతంత మాత్రాన ఉంది ఆ దేశాలు ఆర్థికంగా ఇంకా బల పడలేదు .. వేసవి కాలం పోయింది . వర్షాకాలం వచ్చింది అయినా కరోనా చూపిన ప్రభావం గట్టిగానే ఉంది . వరుసగా దేశాలు లాక్ డౌన్ ప్రకటిస్తూనే కొన్ని నిబంధనల మేర అత్యవసరమైనవి తప్ప మిగతావి మూసివేశారు .ఆ తర్వాత కొన్ని నెలలకు వాటిని ఓపెన్ చేసారు . ఇప్పుడు ప్రపంచ మంత  సాధారణ స్థాయికి వచ్చిందనేలోపు శీతాకాలం మొదలైంది.. ఈ శీతాకాలం లో మరోసారి కరోనా విజృంభిస్తుందనే వార్తలు వస్తున్నాయి . అయితే కొన్ని దేశాలలో ఇప్పటికే కరోనా రెండోసారి ఎటాక్ చేయడం ప్రారంభం అయ్యింది  . ఇందులో ఎక్కువగా యూరోప్ దేశాలు ఉంటడం విశేషం

ఇప్పుడు యూరోప్ లోనే ఒకటైన ఫ్రాన్స్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధించారు. కోవిడ్‌-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు డిసెంబరు 1 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ బుధవారం ప్రకటించారు. యూరప్‌లోని ఇతర దేశాల మాదిరిగానే ఫ్రాన్స్‌లో కూడా సెకండ్‌ వేవ్‌ మొదలైంది. మొదటి దశ కంటే ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అయన తెలిపారు . కరోనా సెకండ్ వేవ్ లో జాగ్రత్తగా ఉండకపోతే ఎక్కువ  మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.సెకండ్‌వేవ్‌లో ఇప్పటికే దేశంలో 35 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.

ఇక లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి బార్లు, రెస్టారెంట్లు, అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయాలని,అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని   మాక్రాన్‌ స్పష్టం చేశారు.  ఒకవేళ లాక్‌డౌన్‌ విధించిన రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లయితే మరిన్ని సడలింపులు కల్పిస్తామని అన్నారు .  ఇక వర్క్‌ఫ్రం హోంకు అనుమతించిన సంస్థలు వాటిని పొడిగించాలని ఆదేశించారు . అదే విధంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులను అలాగే కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: