తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు భూమా కుటుంబానికి అదేవిధంగా జేసీ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. చాలా వరకు కూడా ఈ రెండు కుటుంబాలు పార్టీ కోసం కష్టపడిన పరిస్థితి మనం చూశాం. జేసి కుటుంబం ఏమోగానీ భూమా కుటుంబం మాత్రం పార్టీ కోసం చాలా కష్టపడింది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీరికి జాతీయస్థాయిలో పదవులు ఇచ్చే విషయంలో మాత్రం కాస్త అలసత్వం ప్రదర్శించారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ ని ప్రకటించిన విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో పక్షపాతిగా వ్యవహరించారని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీరి విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియదు. కానీ ఇప్పుడు జెసి కుటుంబానికి మాత్రం కీలక పదవి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. జేసీ పవన్ రెడ్డి కి తెలుగుయువత అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతోపాటు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో కొన్ని కీలక పదవులు కోసం కొంతమంది నేతలు ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గాలతో పాటు ప్రాంతాల వారికి కూడా పార్టీని విభజించి నియోజకవర్గ ఇన్చార్జిని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీనితో రాయలసీమ ప్రాంతానికి జేసీ పవన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నియమించే  అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఉన్న వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునే విధంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారట. భూమా కుటుంబం విషయంలో కూడా చంద్రబాబునాయుడు కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భూమా అఖిలప్రియ ఒక కీలక పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు రెడీ అయ్యారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: