గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. అయితే ఆయన బయటకు వస్తారా లేదా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేకపోయినా ఆయన విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేరుగా ఆయనకు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆయనకు అదే నియోజకవర్గం నుంచి సీటుతో పాటుగా గెలిచాక మంత్రి పదవి కూడా ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారట.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కదా అని ఆయన కొంతమంది వద్దా వ్యాఖ్యలు చేసారు. అయితే ఇప్పుడు ఆయనకు వైసీపీ మంచి హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఇప్పుడు ఆయన గనుక పార్టీ నుంచి బయటకు వచ్చి రాజీనామా చేస్తే ఆ రాజీనామాను వెంటనే ఆమోదించి ఆయనకు అదే నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చే విధంగా హామీ ఇస్తున్నారు. అంతేకాదు త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణ లో చోటు కల్పిస్తామని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఆయనకు సీటు ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా గొట్టిపాటి రవికుమార్ నుంచి రావచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఆయన పార్టీ మారతారా లేదా అనేది ఇంకా ఎలాంటి స్పష్టత లేదని అంటున్నారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన విషయంలో కాస్త బిజెపి ఎంపీ ద్వారా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ ఎంపీకి ఆయనకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో చంద్రబాబు నాయుడు ఆయన విషయంలో బీజేపీ ఎంపీ ని ప్రయోగిస్తున్నట్టు గా తెలుస్తుంది. మరి గొట్టిపాటి రవికుమార్ బయటకు వస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: