ప్రస్తుతం ఎన్నో బీమా కంపెనీలు తమ కస్టమర్ల కోసం ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. పాలసీదారులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు ప్రమాదవశాత్తు పాలసీదారుడు చనిపోయినప్పటికీ  కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థిక భద్రత కల్పించే విధంగా ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక తాజాగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వారికి శుభవార్త చెప్పింది.



 స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురావాలని ఇన్సూరెన్స్ కంపెనీల ను ఆదేశించింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. జనవరి 1 నాటికి సరల్  జీవన్ బీమా పేరుతో ఒక స్టాండర్డ్ పాలసీ తీసుకురావాలని గడువు కూడా నిర్దేశించింది. సింపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తమ కస్టమర్లకు  అన్ని ఇన్సూరెన్స్ సంస్థలూ  అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఇక 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు అన్న నిబంధన పెట్టాలని సూచించింది. నాలుగేళ్ల నుంచి 40 ఏళ్ళ కాల పరిమితితో ఇన్సూరెన్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది.



 అయితే పాలసీదారుడు మరణిస్తే పాలసీ డబ్బులు నామిని లేదా కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ సంస్థ అందిస్తోంది. ఒకవేళ పాలసీ టర్మ్ లో పాలసీదారుడు జీవించి ఉంటే ఎలాంటి డబ్బులు వచ్చేందుకు మాత్రం వీలు ఉండదు. అంతేకాకుండా పాలసీలకు ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. ఇక ఊహించని విధంగా ఇంట్లో ఆదాయం సంపాదించే వారు చనిపోతే పాలసీదారుడు పాలసీదారుడు టర్మ్ లో భాగంగా కుటుంబానికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 5 లక్షల నుంచి 25 లక్షల వరకు బీమా మొత్తాన్ని పాలసీ గా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.. ఈ పాలసీ తీసుకోవాలనుకునే వారు రెగ్యులర్గా ప్రీమియం చెల్లించవచ్చు. లేదంటే ఐదు నుంచి పదేళ్ల కాలపరిమితి లోపు ప్రీమియం కట్టొచ్చు. లేదా ఒకేసారి ప్రీమియం చెల్లించేందుకు కూడా అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: